వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:మ్యాన్ హోల్‌లో పడిన పిల్ల ఏనుగు, సిబ్బంది అపసోపాలు, వైరల్

|
Google Oneindia TeluguNews

వర్షానికి మ్యాన్ హోల్ తెరుస్తారు. ఇక్కడ సిటీలోనే కాదు.. విదేశాల్లోనూ అంతే. అయితే వాటిని వెంటనే మూయడం.. లేదంటే బోర్డు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు జనమే పడిపోతారు. మరీ జంతువుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును థాయ్‌లాండ్ ఓ పిల్ల ఏనుగు పడిపోయింది. దానిని వెలికి తీసేందుకు సిబ్బంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ్యాన్ హోల్‌లో పిల్ల ఏనుగు

మ్యాన్ హోల్‌లో పిల్ల ఏనుగు


నఖాన్ నాయక్ ప్రావిన్స్ రాయల్ హిల్స్ గోల్ఫ్ కోర్సు శివారులో ఘటన జరిగింది. మ్యాన్ హోల్‌లో పిల్ల ఏనుగు పడిపోయింది. విషయం తెలిసిన సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ఆ ఏనుగు తల్లి క్కడకు రాగా.. దానికి మత్తు ఇచ్చి నిద్రబుచ్చారు. దానిని బయటకు తీసేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. బూమ్ లిప్ట్ సహా పలు సాధనాలను ఉపయోగించారు. బయటకు వచ్చేందుకు ఆ ఏనుగు కూడా చాలానే కష్టపడింది.

రంగంలోకి జూ అధికారులు

రంగంలోకి జూ అధికారులు


స్థానికుల సమాచారం ఇవ్వడంతో ఖావొ యావ్ జాతీయ పార్క్ అధికారులు రంగంలోకి దిగారు. దాని పక్కనే తల్లి ఉండగా తొలుత దానిని శాంతింపజేయవలసి వచ్చింది. తర్వాత ఆపరేషన్ చేపట్టారు. రెగ్జిట్ సహా పలు వార్తా సంస్థలు, సోషల్ మీడియా వేదిక మీద షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశారు. తల్లికి మత్తులో ఉండగా.. వెంటనే దానిని లేపేందుకు ప్రయత్నించారు. అదీ తన పిల్ల ఏనుగును బయటకు తీసింది.

3 గంటలు రెస్క్యూ

3 గంటలు రెస్క్యూ


దాదాపు 3 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తల్లి, పిల్ల ఏనుగులు తిరిగి అడవీలోకి వెళ్లే విజువల్ చూడొచ్చు. తల్లి ఏనుగు ఉండగా సహాయ చర్యలకు ఆటంకం కలుగనుంది. అందుకే దానికి మత్తు ఇచ్చారు. అదీ పడుకున్న సహాయ చర్యలు చేపట్టారు. బయటకు వచ్చాకు సీపీఆర్ చేశారు. తర్వాత ఆ రెండు కలిసి అడవీలోకి వెళ్లిపోయింది.

English summary
rescue of baby elephant from a manhole in Thailand. veterinarians used a number of tools, including a boom lift, to pull the calf out while its mother was sedated to allow the rescue operation to continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X