డబ్బులివ్వమంటూ తుపాకీ గురిపెట్టిన దొంగ: క్యాషియర్ షాకింగ్ రియాక్షన్(వీడియో)

Subscribe to Oneindia Telugu

కాన్సాస్: ఇటీవల కాలంలో అమెరికాలో తుపాకీలతో బెదిరింపులకు గురిచేసి దుకాణాదారుల నుంచి దొంగతనాలకు పాల్పడటం సాధారణమే అయిపోయింది. డబ్బులు ఇవ్వమంటూ బెదిరింపులకు గురిచేసి, ఇవ్వలేదంటే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు ఆ దోపిడీ దొంగలు. అయితే తాజాగా జరిగిన ఘటనలో ఓ క్యాషియర్ మాత్రం దోపిడీ దొంగకు ఆ అవకాశం ఇవ్వలేదు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాన్సాస్‌‌లో జిమ్మీ జాన్స్ రెస్టారెంటులో క్యాషియర్ తన విధుల్లో నిమగ్నమై ఉన్నాడు. అంతలోనే వినియోగదారుడులానే రెస్టారెంట్ లోపలికి వచ్చాడు ఓ దొంగ. అతడు క్యాష్ కౌంటర్‌ వద్ద ఉన్న క్యాషియర్‌తో మాటలు కలిపాడు. ఆ వెంటనే నెమ్మదిగా జేబులోంచి తుపాకీ తీసి క్యాషియర్ తలకు గురిపెట్టాడు.

ఒక్క క్షణం అతనిని తేరిపార చూసిన క్యాష్ కౌంటర్ లో ఉన్న వ్యక్తి... అతను బలంగా ఉండడంతో ఎదురు తిరగడం కంటే డబ్బులిచ్చేయడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు. ఇంతలో ఆ దుండగుడు తుపాకీని అతని తలకు గురిపెట్టాడు. దీంతో వెంటనే చేతికి ఉన్న గ్లోవ్ తీసేసి, కౌంటర్‌లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశాడు.

'ఇంకా?' అని దొంగ గద్దించడంతో 'తీసుకో' అంటూ ఏకంగా క్యాష్ బాక్స్‌ను వాడి చేతుల్లో పెట్టేశాడు. అయితే, కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్న దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిని సదరు షాప్ యజమాని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. తుపాకీ గురిపెట్టినా బెదిరిపోకుండా శాంతంగా వ్యవహరించి, తన ప్రాణాలను రక్షించుకున్న ఆ క్యాషియర్‌ను పలువురు మెచ్చుకుంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If a robber held a gun to your face, you would probably panic, cry in fear or run but not this guy. A cashier at a restaurant in Kansas is being talked about his reaction (or lack of) to a gun-wielding robber.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి