వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:పళ్లతో 5 కార్లను లాగి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్, వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

రికార్డుల కోసం రకరకాల ఫీట్లు చేస్తుంటారు. కొన్ని సార్లు బెడిసికొడుతుంటాయి కూడా. కానీ కొందరు మాత్రం రికార్డుల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. పళ్లతో కార్లు.. జుట్టుతో లారీని లాగిన ఘటనలను చూశాం. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ కూడా ఆస్ట్రేలియాలో.. ఓ వ్యక్తి పళ్లతో ఒకటి కాదు రెండు కాదు.. 5 కార్లను లాగేశాడు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పళ్లతో కారు లాగి..

పళ్లతో కారు లాగి..

ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్‌లో గల బ్యాంక్స్‌ టౌన్‌లో ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్ తన పళ్లతో కారు లాగాడు. గిన్నిస్ రికార్డు ప్రతినిధుల ముందట 5 కార్లను లాగేశాడు. గతేడాది నవంబర్ 17వ తేదీన సదరు వ్యక్తి రికార్డు చేశాడు. గిన్సిస్ వరల్డ్ రికార్డ్స్ డే సందర్భంగా ఈ ఫీట్ చేశాడు. అతను ఇంతకుముందు కూడా ఇలాంటి ఫీట్స్ చేశాడు. తన పేరును రికార్డులతో పదిలంగా ఉంచుకున్నాడు.

తేలికపాటి విమానాలను లాగి..

తేలికపాటి విమానాలను లాగి..

ఇంతకుముందు తన పళ్లతో 20 మీటర్ల తేలికపాటి విమానాలను వేగంగా లాగాడు. బరువైన వాహనం 100 ఫీట్ల వరకు లాగాడు. ఈ రెండు ఫీట్లను అతను స్థానిక చారిటీ సంస్థకు నిధుల కోసం చేశాడు. అలా వచ్చిన నిధులను సంస్థకు ఇచ్చేశాడు. ఈ మేరకు డబ్యూఆర్ సంస్థ తెలియజేసింది. ట్రాయ్ చేసిన పని చాలా మంచిది.. రేర్ ఫీట్ చేసి గిన్నిస్ బుక్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు 5 కార్లను లాగి.. భవిష్యత్‌లో వాటిని పెంచేలా ప్లాన్ చేస్తాడని తెలిసింది. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జాగ్రత్తలు తప్పనిసరి

నిజానికి పళ్ల ద్వారా వాహనాలను లాగే సమయంలో చాలా కేర్ తీసుకోవాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉంటుంది. సరయిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ముందడుగు వేయాలి. ట్రాయ్ తన పేరును పదిలంగా ఉంచుకునేందుకు సాహసమే చేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా.. అలా చేశారు. రికార్డులను నెలకొల్పుతూ.. మిగతా వారికి సవాల్ విసురుతున్నాడు.

English summary
Troy Conley-Magnusson pulled five cars with his teeth for a Guinness World Record. record was attempted in Bankstown, New South Wales, Australia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X