Viral Video:కారును చుట్టుముట్టిన బాతులు, స్ట్రక్.. వైరల్
ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్న సమయంలోనే లేట్ అవుతుంది. ఈ విషయం ఆర్జెంట్‌గా వెళ్లేవారికి తెలుసు.. అవును చాలా సందర్భాల్లో అలాంటి సిచుయేషన్‌ను వారు ఫేస్ చేశారు. ఇక విషయానికి వస్తే.. ఇదీ ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ఓ కారు మాత్రం నడిరోడ్డు మీద చిక్కుకుంది. అదీ కూడా బాతుల మధ్య.. అలా వందలాది బాతుల మధ్య కారు ఆగిపోయింది. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

కారును అడ్డుకున్న బాతులు..
వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేశారు. అదీ వైరల్ అవుతుంది. ఇప్పటికే 65 వేల ఓట్స్ పడ్డాయి. వీడియో 14 సెకన్ల నిడివి ఉంది. అందులో ఓ తెల్లని కారు కనిపిస్తోంది. కారు ముందుకు కదులుదామని అనుకుంటే.. ఆ బాతులు కదులుతున్నాయి. రోడ్డు మొత్తం అవే తిరుగుతున్నాయి. దీంతో వెనకాల కానీ.. ముందు కార్లు అలానే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

బాతుల వల్ల లేట్
బాతులు కదలడంతో.. కారు కదిలేందుకు అవకాశమే లేదు. ఎదురుగా ఉన్న కారుల్లోంచి వీడియో తీశారు. వారు మాట్లాడుకునే అంశాలు చక్కగా రికార్డు అవుతున్నాయి. ఇవాళ మీకు ఎందుకు ఆలస్యం అయ్యిందని అన్నారు. బాతుల వల్ల సర్ అని మరొకరు అన్నారు. బాతుల కౌన్సిల్ మాట్లాడాల్సి ఉందని.. తీర్పు ఇవ్వాల్సి ఉందని మరొకరు రాశారు. ఈ విషయాన్ని బాతుల నిపుణులు స్పందించాల్సి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు. ఆ బాతులు ఒకదానిని ఒకటి అనుసరించాయి. అలా వెళుతూ కారును ఆపివేశాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోతి కాల్..
గత వారం కాలిఫోర్నియా జూ నుంచి ఫోన్ వచ్చింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏం జరిగిందో అనుకుని పరుగుతీశారు. కానీ ఫోన్ చేయలేమని సిబ్బంది చెప్పేశారు. చివరికీ ఆరా తీస్తే.. కాల్ చేసింది కోతి అని తెలుసుకున్నారు. వామ్మో.. దీనికి ఇంతా హైరానా పడిపోయామా అనుకుని.. అక్కడినుంచి మెల్లిగా బయల్దేరారు.












Click it and Unblock the Notifications