వుయ్ మిస్డ్ యూ ఎ లాట్..!!
Modi Trump meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఇద్దరు నేతల మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరంచుకుంది.
అణచివేస్తోన్న నేపథ్యంలో..
అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠిన వైఖరిని అనుసరిస్తోన్నారు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఆయనతో ముఖాముఖి భేటీ కావడం చర్చనీయాంమైంది.

దర్జాగా వైట్‌హౌస్‌లో..
భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున సరిగ్గా 2:30 గంటలకు వైట్ హౌస్‌కు చేరుకున్నారు మోదీ. వైట్ హౌస్ సిబ్బంది ఆయనను సాదరంగా స్వాగతం పలికారు. ట్రంప్ ఎదురేగి ఆహ్వానం పలికారు. ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వుయ్ మిస్డ్ యు.. మిస్డ్ యు ఎ లాట్.. అని చెప్పారు.
మంత్రులతో పరిచయం..
ఈ సందర్భంగా అప్పటికి అక్కడికి చేరుకున్న మంత్రులను పరిచయం చేశారు ట్రంప్. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో సహా ఇతర మంత్రులను పేరుపేరునా పరిచయం చేశారు. మోదీ వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి గౌరవించారు. అనంతరం విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. ఆ కొద్దిసేపటికి ఓవల్ ఆఫీస్ ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడే ముఖాముఖి భేటీ అయ్యారు.
50 లక్షలమందికి పైగా..
అమెరికాలో 5.4 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తోన్నారు. 3,50,000 మంది విద్యార్థులు దీనికి అదనం. ఈ పరిస్థితుల్లో అక్రమ వలసదారుల సమస్య తెరమీదికి రావడం వల్ల రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా దీన్ని పరిష్కరించుకోవాలని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications