వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెనూ మార్చుకోవాలి, రిస్క్ తప్పదు: ట్రంప్‌కు వైద్యుల సూచన

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికెట్ ఇచ్చారు వైద్యులు. అయితే ఉబకాయం నుండి ట్రంప్‌ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే స్థూలకాయాన్ని తగ్గించుకొనేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆహరపు అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా వైద్యులు ఇటీవలనే పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ట్రంప్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పారు. అయితే సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల రానున్న రోజుల్లో ట్రంప్‌ అనారోగ్యానికి గురై ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.

ఈ తరుణంలో ట్రంప్ ప్రత్యేక ఆహరపు అలవాట్లు చేసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రత్యేకంగా మెనూను వైద్యులు సూచించారు. ఈ మెనూను తప్పకపాటించాలని వైద్యులు ట్రంప్ కు సూచించారు.

ఉబకాయంతో ట్రంప్‌కు ముప్పే

ఉబకాయంతో ట్రంప్‌కు ముప్పే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముప్పు తప్పదని అమెరికా వైద్యులు తేల్చి చెప్పారు. 71 ఏళ్ల వయసులో 29కి పైగా బీఎంఐ స్కోర్‌ కారణంగా హార్ట్‌ ఎటాక్‌, గుండె సంబంధిత వ్యాధుల బారినపడే రిస్క్‌ నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌కు స్పెషల్‌ డైట్‌ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్‌ శరీరంలో చెడు కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ గత ఏడాది 169 కాగా, ఇప్పుడవి 233కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

'ట్రంప్‌తో లైంగిక సంబంధాలు నిజమే, ఇవాంకా మాదిరిగా ఉన్నావని కితాబు' 'ట్రంప్‌తో లైంగిక సంబంధాలు నిజమే, ఇవాంకా మాదిరిగా ఉన్నావని కితాబు'

ఫాస్ట్‌పుడ్‌కు ట్రంప్ దూరం కావాలి

ఫాస్ట్‌పుడ్‌కు ట్రంప్ దూరం కావాలి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను పక్కనపెట్టాలని వైద్యులు సూచించారు. వైట్‌హౌస్‌ చెఫ్‌తో ప్రత్యేకంగా వండిన ఆహారాన్ని తీసుకోవాలని న్యూయార్క్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ సీఈవో రూలీ చెప్పారు. ఫైబర్‌ నిండిన కూరగాయలు, ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

25 శాతం మించకుండా కార్బోహైడ్రేట్స్

25 శాతం మించకుండా కార్బోహైడ్రేట్స్

తాను తీసుకొనే ఆహరంలో 25 శాతం మించకుండా కార్బోహైడ్రేట్స్‌ తీసుకోవాలని వైద్యులు ట్రంప్ కు సూచించారు.జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండి ఫైబర్‌ అధికంగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని కెనడాకు చెందిన డైటీషియర్‌ అబీ షార్ప్‌ చెప్పారు. ఫైబర్‌ కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ తగ్గిస్తుందన్నారు.

బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తీసుకోవాలి

బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తీసుకోవాలి

ట్రంప్ ప్రతి రోజూ కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. బ్రేక్ ఫాస్ట్ లో ఓస్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఓట్స్ తో చేసిన ఆహరంతో పాటు పండ్లు తీసుకోవాలని సూచించారు. లంచ్ కు క్వినోవా రైస్‌తో పాటు కూరగాయల సలాడ్ అయితే అత్యుత్తమమని సూచించారు.డిన్నర్‌ లో సాల్మన్‌ ఫిష్‌తో చేసిన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.

English summary
Fiber hidden in burritos and quarter-mile strolls on the golf course could be key to bringing President back from the obesity line, experts explain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X