వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జ్ ఫ్లాయిడ్‌ కేసు ఏమైంది... ఈ విచారణ ఎందుకంత ముఖ్యం?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మినియాపోలిస్ నిర్బంధంలో 2020 మే 29న జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయన ప్రదేశం

ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మినియాపోలిస్ భద్రతాధికారి డెరెక్‌ చావిన్‌ విచారణకు జ్యూరీ ఎంపిక ప్రారంభం కానుంది.

తెల్లజాతీయిడైన చావిన్‌, నల్ల జాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడ మీద మోకాలితో చాలాసేపు నొక్కిపెడ్దటాన్ని మినియాపోలిస్ వాసులు తమ కళ్లారా చూసినట్లు చెప్పారు.

ఈ సంఘటన తరువాత, పోలీసుల దౌర్జన్యాన్ని, జాత్యహంకారాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

జార్జ్ ఫ్లాయిడ్‌ ఎలా చనిపోయారు?

46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ 2020 మే 25న సౌత్ మిన్నియాపోలిస్‌లోని ఒక దుకాణానికి వెళ్లి ఒక సిగరెట్ ప్యాకెట్ కొన్నారు.

ఫ్లాయిడ్ 20 డాలర్ల నకిలీ నోటును ఇచ్చారని భావించిన షాప్ అసిస్టెంట్ సిగరెట్ ప్యాకెట్‌ను వెనక్కి తిరిగి ఇవ్వమన్నారు. అందుకు ఫ్లాయిడ్ నిరాకరించడంతో పోలీసులను పిలిచారు.

పోలీసు అధికారులు వచ్చి ఫ్లాయిడ్ చేతులకు బేడీలు వేసి, తమ వాహనంలోకి ఎక్కించబోతుంటే ఆయన ప్రతిఘటించారు. దాంతో అధికారులు ఫ్లాయిడ్‌ను అక్కడే కింద పడేసి ఆయన మొహాన్ని రోడ్డుకు ఆనిస్తూ నొక్కిపట్టారు.

అప్పుడే అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ సంఘటనను తమ ఫోన్లలో రికార్ట్ చెయ్యడం మొదలు పెట్టారు.

44 ఏళ్ల చావిన్ తన ఎడమ మోకాలిని ఫ్లాయిడ్ తలకు, మెడకు మధ్యన ఉంచి ఏడు నిముషాల 46 సెకండ్ల వరకూ నొక్కి పట్టి ఉంచారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇద్దరు ఆఫీసర్లు ఈ అణచివేతకు సహాయం చేయగా, మరొక ఆఫీసర్, సాక్షులు జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నారు.

ఫ్లాయిడ్ 20 సార్లు కన్నా ఎక్కువే "తనకు ఊపిరి అందట్లేదని" చెప్పారు. పోలీసులు ఫ్లాయిడ్‌ను మోకాళ్లపై ఈడ్చుకెళ్లడం వీడియోలో చూడవచ్చు.

ఒక గంట తరువాత, ఆయన చనిపోయినట్లు ఆసుపత్రిలో నిర్థరించారు.

బాధ్యులైన చావిన్‌, మరో ముగ్గురు అధికారులను ప్రభుత్వం తొలగించింది.

డెరెక్ చావిన్

జార్జ్ ఫ్లాయిడ్ విచారణ ఎప్పుడు జరగనుంది?

కొన్ని వారాల పాటు సాగే ఈ విచారణ మార్చి 8న జ్యూరీ సభ్యుల ఎంపికతో ప్రారంభం కానుంది.

మార్చి 29న వాదనలు మొదలవుతాయి. విచారణ కనీసం ఒక నెల పాటూ కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఇరు వైపుల న్యాయవాదులూ కొన్ని వందల మంది అభ్యర్థులను ప్రశ్నించి, చివరకు పదహారుగురిని జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేయనున్నారు.

వీరిలో 12 మంది ఈ విచారణలో పాల్గొంటారు. నలుగురిని అదనంగా (పన్నెండు మందిలో ఎవరైనా రాలేని పక్షంలో పాల్గొనడానికి) కోసం ఎంపిక చేస్తారు.

జ్యూరీ సభ్యులుగా ఉండాలనుకునేవారు అనేకమంది ఇప్పటికే తమకు ఇచ్చిన ప్రశ్నాపత్రాలు నింపి ఇచ్చారు.

ప్యానల్ నుంచీ ఇరువైపులవారూ జ్యూరీ సభ్యులను తొలగించవచ్చు. కానీ, జాతి, మత, లింగ వివక్ష కారణంగా తొలగించారని అనిపిస్తే అవతలి వర్గం వారు "బాస్టన్ ఛాలెంజ్"ను జారీ చేయవచ్చు.

ఆ సభ్యులను తొలగించాలా, వద్దా అనే తుది నిర్ణయం న్యాయమూర్తి చేతిలో ఉంటుంది.

పోలీసుల క్రూరత్వానికి నిరసనగా వాషింగ్టన్‌లో 2020 జూన్ నెలలో జరిగిన ప్రదర్శన

ఫ్లాయిడ్ మరణానికి అమెరికాలో వచ్చిన స్పందన ఏమిటి?

ఫ్లాయిడ్ మరణ వార్త తెలిసిన వెంటనే మినియాపోలిస్‌ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వచ్చారు.

ఆ మర్నాడే నలుగురు పోలీస్ అధికారులనూ విధుల నుంచి తొలగించారు.

వాళ్లు పని చేసిన పోలీస్ స్టేషన్లకు నిప్పంటించారు. అతి కొద్ది సమయంలోనే ఈ నిరసనలు మిగత నగరాలకు కూడా వ్యాపించాయి.

వారంలోపే అమెరికాలోని 75 నగరాల్లో నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది.

ఆఫ్రో-అమెరికన్లపై పోలీసుల దౌర్జన్యం గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరిగాయి.

2013లో ట్రాయ్వాన్ మార్టిన్ అనే యువకుడి హత్య తరువాత మొదలైన జాత్యహంకార వ్యతిరేక ఉద్యమం "బ్లాక్ లైవ్స్ మేటర్" మళ్లీ తెర పైకి వచ్చింది.

అమెరికాలోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని తెల్ల జాతీయులు కూడా జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతెత్తారు.

పోలీసులు చేసే అరెస్ట్‌లు, అనుమానితులను నిర్బంధించే విధానాలకు సంబంధించిన చట్టాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టారు.

అక్కడితో ఆగిపోకుండా, పని చేసే చోటు సమానత్వం, తెలియకుండానే పక్షపాతం వహించడం, బానిసత్వం కొనసాగాలని అనుకోవడంలాంటి అనేక అంశాలపై చర్చలు తెరపైకి వచ్చాయి.

మినియాపొలిస్ కోర్ట్ హౌజ్ వెలుపల భద్రతా ఏర్పాట్లు

మిగతా ప్రపంచం ఎలా స్పందించింది?

ఫ్లాయిడ్ మరణానికి ప్రతిస్పందనగా జాత్యహంకార ధోరణులను ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

చాలా చోట్ల తమ తమ దేశాల్లో పోలీసుల అరాచకాలకు బలి అవుతున్న వారిపై దృష్టి సారించారు.

ఆస్ట్రేలియాలో మూలవాసులపై జరుగుతున్న దురాగతలపై దృష్టి కేంద్రీకరించగా, బ్రిటన్‌లో 17వ శతాబ్దానికి చెందిన బానిస వ్యాపారి విగ్రహాన్ని కూల గొట్టి బ్రిస్టల్ నదిలో పడవేశారు.

అనేక కార్పొరేట్ సంస్థలు బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి మద్దతునిచ్చాయి.

అథ్లెట్లు "టేక్ ది నీ" అంటూ సంఘీభావాన్ని తెలియజేశారు.

సెకండ్ డిగ్రీ మర్డర్ అంటే ఏంటి?

చావిన్‌పై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదైంది. సెకండ్ డిగ్రీ మర్డర్ అంటే అనాలోచితంగా హత్యకు పాల్పడడం. ఈ నేరానికి గరిష్టంగా 40 యేళ్ల శిక్ష పడవచ్చు.

అమెరికాలో ప్రాణాలు హరించేంత కఠినమైన చర్యలు తీసుకున్నందుకు పోలీస్ అధికారులపై కేసు వెయ్యడం అరుదు. అలాంటి వాటికి శిక్ష పడడం ఇంకా అరుదు. ఎందుకంటే, మా ప్రాణాలకు హాని ఉంది అంటూ అధికారులు వాదించి సులువుగా తప్పించుకోవచ్చు.

ప్రస్తుతం కోవిడ్ నిబంధనల కారణంగా చావిన్ విచారణ, మిగతా ముగ్గురి విచారణ విడి విడిగా జరగనున్నాయి.

మిగతా ముగ్గురు అధికారులపై సెకండ్ డిగ్రీ మర్డర్‌కు సహరించినందుకు కేసులు నమోదు చేశారు. వీరి విచారణ ఆగస్ట్‌లో జరగనుంది.

కోర్టులో నిబంధనలు ఎలా ఉంటాయి?

ఈ కేసు విచారణ మొత్తం ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తారు. ఇది అమెరికాలో అసాధారణమైన విషయం.

ఏ సమయంలోనైనా చావిన్, ఫ్లాయిడ్ కుటుంబాల నుంచీ ఒక్క వ్యక్తి మాత్రమే కోర్టులో హాజరు అయ్యేందుకు అవకాశం ఉంటుందని జడ్జ్ తెలిపారు.

నినాదాలతో కూడిన్ ఫేస్ మాస్కులు ధరించి కోర్టు గదికి రాకూడదు.

BBC ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What happened to the George Floyd case, why is this trial important?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X