వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖతార్ సృష్టించిన ‘ముత్యం’ లాంటి ఈ కృత్తిమ ద్వీపం ప్రత్యేకత ఏంటి? ప్రజలు ఇక్కడ ఉండటానికి ఎందుకు ఎగబడుతున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లా పెర్లా కృత్తిమ ద్వీపం

''ప్రపంచంలో ఖతార్ ఒక బుడగ అయితే, 'పెర్ల్’ అనేది ఖతార్ లోపల ఉన్న మరో బుడగ’’

లా పెర్లా అనే ద్వీపం గురించి బ్రిటిష్ వాసి సివోభన్ టలీ పైవిధంగా వర్ణించారు. ఖతార్‌లో ప్రవాసుల కోసం నిర్మించిన విలాసవంతమైన కృత్తిమ ద్వీపంలో సివోబన్ టలీ నివసిస్తున్నారు. ఆ ద్వీపంలోని సదుపాయాలు, ప్రజల జీవన శైలి గురించి ఆయన వివరించారు.

ప్రత్యేకంగా నిర్మించిన ఈ ప్రదేశాన్ని చూస్తే సివోభన్ చెప్పింది సరైనదే అని మీరు కూడా అంటారు.

ఇక్కడ వీధులు ఒక గల్ఫ్ దేశంలో కాకుండా మధ్యదరా సముద్రంలోని యూరోపియన్ భాగంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

ఖతార్ దేశంలో కంటే ఎక్కువ మంది విదేశీయులు ఇక్కడే కనిపిస్తారు. చాలా దేశాలకు చెందిన, పాశ్చాత్య దుస్తులు ధరించిన ప్రజలు సాయంత్రం సమయాల్లో ఇక్కడి వీధుల్లోని కేఫ్‌లు, రెస్టారెంట్లలో కూర్చొని ఉంటారు.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

స్పెయిన్ తరహాలో నిర్మించిన కూడళ్లు, కాలువలతో పాటు వెనిస్‌లో ఉండేటువంటి భవనాలు ఇక్కడ కనిపిస్తాయి. వృత్తాకారంలో నిర్మించిన ఇళ్ల చుట్టూ ఫౌంటెన్‌లు ఉంటాయి. వాటి మధ్య నుంచి తక్కువ వెడల్పు ఉండే రహదారులు... వాటిపై లక్షల డాలర్ల విలువైన స్పోర్ట్స్ కార్లు మీకు కనిపిస్తుంటాయి.

ఇక్కడ ప్రజలు విలాసవంతమైన విల్లాలు లేదా అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తారు. 20-20 అంతస్థులు ఉండే ఈ భవనాల్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, ప్రైవేట్ బీచ్ వంటి సదుపాయాలు ఉంటాయి. దోహాలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి భవనాలు కనిపించవు.

ఉదాహరణకు ఇక్కడ సౌదీ అరేబియా అమ్మాయిలు, ఒక లెబనాన్ రెస్టారెంట్‌కు వెళ్లిన కొద్ది క్షణాలకే తల నుంచి హిజాబ్‌ను తొలిగిస్తారు. ఆ పరిసరాల్లో తల, మెడ వంటి శరీర భాగాలు బయటకు కనిపించేలా ఉండే దుస్తులు వేసుకొని తిరిగే అమ్మాయిలు కనిపిస్తారు. స్లీవ్ లెస్ కుర్తీలు, పొట్టి స్కర్టులు వేసుకొనే మహిళలు కూడా అక్కడ ఉంటారు.

మద్యాన్ని అందించే హోటళ్లు పుష్కలంగా ఉన్నాయి.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

'లా పెర్లా’లోని అందమైన ప్రపంచం

యునైటెడ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రధాన ప్రాజెక్ట్ ''లా పెర్లా’’. ఇది ఖతార్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ కృత్తిమ ద్వీపాన్ని ఆ సంస్థే నిర్మించింది. దీని కోసం 4 మిలియన్ చదరపు మీటర్ల సముద్రాన్ని ఉపయోగించుకున్నారు.

ఖతార్‌ దేశానికి చెందని వ్యక్తులు (విదేశీయులు) కూడా ప్రాపర్టీని కొనుగోలు చేసే తొలి పట్టణ ప్రాజెక్టు ఇది. ఇక్కడ 25 వేల నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం 33 వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు.

ఇక్కడ స్టూడియో హౌస్ ఖరీదు 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.24.5 కోట్లు). సముద్రానికి అభిముఖంగా ఉండే 5 బెడ్‌రూమ్‌ల విల్లా 12 మిలియన్ డాలర్ల(సుమారు రూ.100 కోట్లు)కు అందుబాటులో ఉంది.

ఆకాశం నుంచి చూసినప్పుడు ఈ ద్వీపం ఒక ముత్యం ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ అనేక రెస్టారెంట్లు, విలాసవంతమైన హోటళ్లు, షాపింగ్ మాల్స్, బార్లు, సినిమా హాళ్లు, విలాసవంతమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న అమెరికా జట్టు ఇక్కడి ఒక లగ్జరీ హోటల్‌లోనే బస చేస్తోంది.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

వలసదారుల ప్రత్యేకం

సివోభన్, ఇయాన్ టులీ దంపతులు ఖతార్‌లో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. ఈ ఏడేళ్లలో ఆరున్నరేళ్లు వారు ''లా పెర్లా’’లోనే గడిపారు. భార్య బ్రిటన్‌కు చెందినవారు కాగా భర్త స్కాటిష్. వీరిద్దరూ ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నారు.

ఆయన మాకు వీవా బాహ్రియాలోని తన భవనాన్ని చూపించారు. బీచ్ మధ్యలో నిర్మించిన 30 ఎత్తైన భవన సమూహాల్లో ఇది కూడా ఒకటి. ఈ భవన సమూహాలు బీచ్‌లో అర్ధవృత్తాకారంలో విస్తరించి ఉన్నాయి.

''మేం మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. కానీ, తక్కువ వ్యవధిలోనే రెస్టారెంట్లు, కేఫ్‌లు, వ్యాపార సముదాయాలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ నడవడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది’’ అని సివోభన్ చెప్పారు.

దోహా ఒక అధునాతన నగరం. ఇక్కడ రహదారుల లైన్లు అనేకం ఉంటాయి. కొన్ని రహదారులు, కూడళ్లు మనల్ని షాపింగ్ సెంటర్స్ వైపు నడిపిస్తాయి. అయితే, ఈ రహదారులు పాదాచారులకు అనువుగా ఉండవు. ఇక్కడ నీడ దొరకడం, పార్కింగ్ స్థలం చాలా కష్టం.

ఏడాదిలో చాలా కాలం పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల నడక కష్టమే.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

''ఇక్కడ మూడేళ్లు మాత్రమే ఉండాలని తొలుత మేం అనుకున్నాం. కానీ, మేం ఇక్కడకు వచ్చి దాదాపు ఏడేళ్లు అయింది. ఇక్కడ చాలా సంతోషంగా, సురక్షితంగా ఉన్నాం’’ అని సివోభన్ చెప్పారు.

సాధారణంగా ఖతార్ చాలా సురక్షిత ప్రదేశం. కానీ పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రజల ప్రవర్తన, దుస్తులు ధరించే విధానం సంప్రదాయాలను ఇష్టపడే ఖతార్ పౌరులకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుందని అక్కడి పౌరులు చెబుతున్నారు.

మొదట 'పెర్ల్’లో ప్రవాసీయులు మాత్రమే నివసించేవారు. వారిలో చాలామంది పాశ్చాత్య దేశాలకు చెందినవారు ఉండేవారు. ఖతార్‌లోని సౌకర్యాలు పాశ్చాత్యులను ఆకర్షిస్తాయి.

కానీ ఇప్పుడు ఖతార్‌కు చెందిన చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఖతార్ రాజకుటుంబానికి చెందిన అనేక ఆస్తులు ఇక్కడ ఉన్నాయి.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

వెనిస్ గల్లీలు, చిన్న ప్రైవేట్ ద్వీపాలు

ఇక్కడే వెనిస్ నగరాన్ని పోలి ఉండే ఒక వీధి ఉంది. దాని పేరు క్వినెట్ క్వార్టియర్. ''నీళ్లపై తేలియాడే చిన్న పడవలే కాకుండా ఇది మొత్తం వెనిస్‌ తరహాలోనే ఉంటుంది’’ అని అక్కడ నివసించే వెనిజులాకు చెందిన గుస్తావో జరామిలో చెప్పారు.

గుస్తావో ఒక ఇంజినీర్. ఆయన 'లా పెర్లా’లో నివసిస్తున్నారు. ఆయన భాగస్వామి సబ్రీనా మసివోవిచాతో కలిసి ఒక పొడవైన టవర్‌లో ఉంటున్నారు.

వారిద్దరూ మమ్మల్ని కారులో ఆ ప్రాంతం అంతా తిప్పి చూపించారు. పెర్ల్‌లో నివసించడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్పారు.

''వెనిజులాలోని సమస్యల ప్రకారం చూస్తే ప్రపంచంలోని ఏ ప్రాంతమైన మంచిదే అనిపిస్తుంది. కానీ, దోహాలో, లా పెర్లాలో నివసించడం మరో లెవల్‌లో ఉంటుంది.

ఇక్కడి వీడియోలు చిత్రీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీడియో తీయడం ఇక్కడ నిషేధం’’ అని గుస్తావో చెప్పారు.

గుస్తావో ఇక్కడ విద్యుత్ రంగంలో పనిచేస్తారు. అపార్ట్‌మెంట్‌లోని సౌకర్యాలు, రవాణా, టెలిఫోన్ బిల్లులను వారు చెల్లిస్తారు. మొత్తంగా జీతంలో 25 శాతం మాత్రమే ఆయనకు ఖర్చు అవుతుంది. మిగిలిన పొదుపు సొమ్ముపై పన్ను కూడా ఉండదు.

అక్కడ నివసించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన మాకు వివరించారు. అప్పుడే మాకు ఒక పెద్ద చతురస్రాకారంలో ఉన్న భవనం కనిపించింది.

ఆ భవనం గురించి ఆయన వివరించారు. ''ఇది ఒక రకమైన సూపర్ కండిషనింగ్ ప్లాంట్. ఇక్కడ మంచు నీటిని శుద్ధి చేస్తారు. వాటిని పైపుల ద్వారా లా పెర్లాలోని ప్రతీ భవనానికి తరలిస్తారు’’ అని చెప్పారు.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

బుడగ లోపల బుడగ

ఈ ద్వీపంలో ఎత్తైన కార్యాలయ భవనాలు, స్పోర్ట్స్ మెరీనాలు, నివాస టవర్లు, విల్లాలు ఉన్నాయి.

సివోభన్ వాటిని చూపిస్తూ... ''ఒకవేళ ఖతార్ అనేది ఒక బుడగ అయితే, పెర్ల్ అనేది దాని లోపల మరో బుడగ’’ అని అన్నారు.

కోవిడ్ కారణంగా ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలు, యుక్రెయిన్ యుద్ధంతో తలెత్తుతున్నసమస్యల గురించి మేం మాట్లాడుతుండగా... ఈ ద్వీపంలో జీవనం బయటి ప్రపంచానికి ఎంత భిన్నంగా ఉంటుందో ఆయన చెప్పారు.

లా పెర్లాలోని ఈ వెలుగు జిలుగుల గురించే కాకుండా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, దేశాల నుంచి వలస వచ్చిన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల గురించి కూడా చర్చ జరుగుతోంది.

కార్మికుల కోసం దోహా శివార్లలో శిబిరాలు ఏర్పాటు చేశారు. వారిని లా పెర్లా వంటి ప్రదేశాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.

ప్రజల భద్రత కోసమే ఇలా చేశామని ఖతార్ ప్రభుత్వం చెబుతోంది.

''వృత్తిపరంగా చెప్పాలంటే ఖతార్ ప్రజలకే అత్యధిక ప్రాధాన్యత దక్కుతుంది. మేం ఇక్కడ అందరినీ కలుస్తాం. కానీ, ఇక్కడ లాటిన్, స్పానిష్ లాంటి వాతావరణం ఉంటుంది. మేం ఎక్కువగా స్థానిక అరబ్ పౌరులతో ఎక్కువగా కలవం’’ అని గుస్తానో చెప్పారు.

లా పెర్లా కృత్తిమ ద్వీపం

ఇబ్బందులు

''ఇక్కడ అత్యంత చెత్త విషయం ఏంటంటే నిరంతరం డ్రిల్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ప్రతీచోటా నిర్మాణ పనులు జరుగుతుంటాయి. సమీపంలోని భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. దాన్ని కట్టడం సెప్టెంబర్‌లోనే ప్రారంభించారు’’ అని సివోభన్ చెప్పారు.

పాఠశాలలు, ఆసుపత్రులు లేకపోవడం గురించి గుస్తానో దంపతులు ఫిర్యాదు చేశారు. ద్వీపంలో ఒకే రహదారి మార్గం ఉంటుంది. అదెప్పుడూ ట్రాఫిక్‌తో నిండి ఉంటుంది.

అయితే, ఇప్పుడు అక్కడ భారీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దానివల్ల ప్రజలకు లబ్ధి కలుగుతుందని వారు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is special about this artificial island like a 'pearl' created by Qatar? Why do people fly to stay here?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X