వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WhatsAPP కొత్త ఫీచర్: కాల్‌ వెయిటింగ్‌కోసం వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోండి

|
Google Oneindia TeluguNews

ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్ వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించేవారికి కొత్తగా కాల్ వెయిటింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలింగ్ ఫీచర్‌లో సరికొత్త అప్డేట్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యం చెప్పింది. దీన్ని అప్‌డేట్ చేసుకుంటే రెగ్యులర్ ఫోన్‌ కాల్స్‌లో ఎలాగైతే కాల్ వెయిటింగ్ వస్తుందో వాట్సాప్‌లో కూడా వీడియో కాలింగ్ లేదా వాయిస్ కాలింగ్ చేస్తున్న సమయంలో కాల్ వెయిటింగ్ వస్తుందని యాజమాన్యం చెప్పింది.

ఇక తాజాగా వచ్చిన కాల్ వెయిటింగ్ అప్‌డేట్ v2.19.352 వర్షెన్ అంతకు మించి అడ్వాన్స్ వర్షన్ వాట్సాప్‌లలో ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే v2.19.128 వాట్సాప్ బిజినెస్ వర్షెన్ యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉందని వాట్సాప్ సంస్థ వెల్లడించింది. నాలుగేళ్ల క్రితమే వాట్సాప్ కాలింగ్ ఫీచర్‌ను కస్టమర్లకు తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వాట్సాప్ ఫీచర్‌పై పలు అప్‌డేట్లు తీసుకొస్తూ వచ్చింది. గ్రూప్ వాయిస్ కాలింగ్, ఒకే సారి ఒకే సమయంలో ఇద్దరితో వీడియో కాల్స్‌ చేసి మాట్లాడుకునే అప్‌డేట్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు కాల్ వెయిటింగ్ ఫంక్షన్ అందుబాటులో లేదు. కాల్ మాట్లాడిన తర్వాత మిస్డ్ కాల్ అలర్ట్ వచ్చేది.

WhatsAPP brings in new update call waiting feature for its Android users

ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ వాట్సాప్ కొత్త కాల్ వెయిటింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక కస్టమర్ వాట్సాప్ వాయిస్ కాలింగ్ లేదా వీడియో కాలింగ్ చేస్తున్న సమయంలో మరొకరు తనకు వాట్సాప్ కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ కనిపిస్తుంది. అలాంటి సమయంలో ప్రస్తుత కాల్‌ను కట్ చేసి వచ్చే కాల్‌ను రిసీవ్ చేసుకోవడం కానీ లేదా రిజెక్ట్ చేయడం కానీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే కాల్ వెయిటింగ్ ఫీచర్ ఇంకా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దలేదు. రెండు కాల్స్‌ను మెర్జ్ చేసే ఆప్షన్ ఇంకా లేదు. ప్రస్తుత కాల్‌ను హోల్డ్‌లో ఉంచి మరో ఇన్‌కమింగ్ కాల్ మాట్లాడే వెసులుబాటు రాలేదు.

English summary
WhatsApp last week rolled out a new update for Android users. The new update brings an important change to how it handled calling feature on the app. Users with the updated WhatsApp app will now get a call waiting alert
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X