ఇకపై వాట్సప్ ఉచితం: చందా అవసరం లేదు
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి ఇకపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రముఖ మెసేజింగ్ సంస్ధ వాట్సప్ ప్రకటించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఏడాది పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాది పూర్తైన తర్వాత, సంవత్సరానికి గానూ ఒక డాలర్‌ను చెల్లిస్తే మరో ఏడాది పాటు వాడుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఆ ఫీజును రద్దు చేయాలని వాట్సప్ సంస్ధ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్ధ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. వాట్సప్‌ను వాడుతున్న కస్టమర్లలో చాలా మంది క్రెడిట్, డెబిట్ కార్డులు లేని వారున్నారని, ఏడాది పూర్తైన తర్వాత డబ్బులు చెల్లించడం లేదని పేర్కొంది.

ఇలా డబ్బు చెల్లించకపోవడంతో వాట్సప్ వినియోగించే కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయని బ్లాగు పోస్ట్‌లో వెల్లడించింది. ఈ కారణం చేత వాట్సప్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
‘‘ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది తమ స్నేహితులు, బంధువులతో సంబంధాన్ని కొనసాగించడానికి వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. ఇకపై వారి నుంచి ఎలాంటి సబ్‌స్ర్కిప్షన్ ఫీజునూ వసూలు చేయం'' అని పేర్కొంది.












Click it and Unblock the Notifications