కారు దిగి ప్రజలతో మోడీ షేక్ హ్యాండ్, నేపాల్‌కు టాటా (పిక్చర్స్)
ఖాట్మాండ్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖాట్మాండ్ ప్రజలకు, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ నేపాల్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మోడీ సార్క్ సమావేశాల కోసం నేపాల్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఎనిమిది మంది సార్క్ దేశాధినేతలకు నేపాల్ పర్వత ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందుకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంగా... మోడీ ఖాట్మాండ్ వీధుల్లో ఉన్నట్టుండి తన కారును ఆపించారు.
కారు దిగి నడుచుకుంటూ వెళ్లి, అప్పటికే అక్కడకు భారీగా చేరిన నేపాలీయులకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారు. వారి ఆతిథ్యానికి సంతోషిస్తున్నానని తెలిపారు. కరచాలనం చేసి వారిని ఆనందంలో ముంచెత్తారు. తన కోసం రోడ్డుకిరువైపులా వందలాదిమంది చేతులు ఊపుతూ ఎదురుచూస్తున్న విషయాన్ని గమనించిన మోడీ కారు దిగి.. కొంతమందితో కరచాలనం చేసి తన ఆత్మీయతను పంచుకున్నారు.

మోడీ, షరీఫ్
సార్క్ సమావేశాలకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు గురువారం నాడు చేతులు కలుపుతున్న దృశ్యం.

నరేంద్ర మోడీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖాట్మాండు నుండి భారత దేశానికి బయలుదేరిన సమయంలో అక్కడున్న వారికి చేయి ఊపుతున్న దృశ్యం.

నరేంద్ర మోడీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖాట్మాండు నుండి భారత దేశానికి బయలుదేరిన సమయంలో అక్కడున్న నమస్కరిస్తున్న దృశ్యం.

నరేంద్ర మోడీ
నేపాల్ దేశ రాజధాని ఖాట్మాండు నుండి భారత దేశానికి బయలుదేరడానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..
సార్క్ సదస్సు సందర్భంగా నేపాల్ ప్రభుత్వ ఆతిథ్యం పట్ల ప్రధాని సుశీల్ కోయిరాలాకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం థాంక్యూ నేపాల్ అంటూ ట్వీట్ చేశారు. కాగా, సార్క్ సభ్య దేశాల నాయకులు ధులిఖేల్ పర్యాటక ప్రాంతంలో గురువారం ఇష్టాగోష్ఠి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోడీ అక్కడ ఒక మర్రి మొక్కను నాటారు. అనంతరం భారత్ బయలుదేరిన మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చారు.












Click it and Unblock the Notifications