LATAM Airlines: విమానం గాల్లో ఉండగా బాత్ రూమ్‍లో కుప్పకూలిన పైలట్..

గాల్లో ఎగురుతున్న విమానంలో పైలట్ బాత్ రూమ్ లో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. లాటమ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అమెరికాలోని మియామీ ఎయిర్ పోర్టు నుంచి రాత్రి 10:11 గంటలకు చిలీ రాజధాని శాంటియాగో బయల్దేరింది. విమానం గాల్లో ఉండగాతత బాత్ రూమ్ కు వెళ్లిన పైలట్ అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఆ పైలెట్ మృతి చెందాడు.

ఆగస్ట్ 14 ఆదివారం నాడు విమానం టెకాఫ్ అయిన మూడు గంటల తర్వాత పైలట్ కెప్టెన్ ఇవాన్ అండౌర్ బాత్ రూమ్ కు వెళ్లారు. అతనికి అక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన సిబ్బంది ఇవాన్ ను బాత్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అతనికి ప్రథమిక చికిత్స అందించారు. మరో పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం పనామా ఎయిర్ పోర్ట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. వారు అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు.

When the pilot suffered a heart attack while the plane belonging to Latum Airlines was flying in the air

దీంతో విమానాన్ని పనామా ఎయిర్ పోర్టులో అత్యవస ల్యాండింగ్ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మెడికల్ సిబ్బంది ఇవాన్ అండౌర్ వెళ్లి పరీక్షించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. పైలట్ అస్వస్థతకు గురైనప్పుడు విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు" అని లాటమ్ ఎయిర్ లైన్స్ పేర్కొంది."మియామి-శాంటియాగో మార్గంలో ఉన్న ఫ్లైట్ LA505, కమాండ్ సిబ్బందిలోని ముగ్గురు సభ్యులలో ఒకరికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పనామాలోని టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయినప్పుడు, అత్యవసర సేవలు ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించాయి. కానీ పైలట్ మరణించాడు, "అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవాన్ అండౌర్ గత 25 ఏళ్లుగా పైలట్ గా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం అతని వయస్సు 56 సంవత్సరాలు. ఒక రోజు తర్వాత ఆ విమానం చిలీకి వెళ్లింది. గగనతలంలో పైలట్‌ అస్వస్థతకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ అస్వస్థతకు గురయ్యాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+