Modi-Biden Meet : మోడీకి బైడెన్ క్లాస్ పీకడం లేదట- వైట్ హౌస్ కీలక ప్రకటన..

ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల యూఎస్ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. ఉదయం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తో భేటీ అయిన ప్రధాని మోడీ.. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇందులో ఓ కీలక అంశంపై జో బైడెన్ ఈసారి ప్రధాని మోడీని ఇబ్బంది పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఈ మధ్య అమెరికా పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అమెరికాతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు మోడీ సర్కార్ ఎదురుదాడి చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు అమెరికా పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్ ఇదే అంశాన్ని నేరుగా ప్రస్తావిస్తే ఏం సమాధానం చెప్పాలనే విషయంలో మోడీ కసరత్తు చేసి మరీ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు అంత అవసరం రాకపోవచ్చని తెలిసింది.

 modi-bidenmeet

యూఎస్ లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జో బైడెన్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన తన దేశానకి ప్రపంచ వేదికపై ప్రభావాన్ని పెంచడానికి మోడీ ప్రయత్నాలు చేస్తుండగా..చైనాకు భారతదేశం వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా ఉండాలని వాషింగ్టన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మోడీ టూర్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వివిధ ఒప్పందాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో రక్షణ సహకారం, విక్రయాలు, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, మైక్రోన్ టెక్నాలజీ, ఇతర యూఎస్ కంపెనీల ద్వారా భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించినవి ఉన్నాయి.

అయితే భారతదేశంలో ప్రజాస్వామ్య వెనుకబాటుతనం గురించి మాత్రం అమెరికా ఆందోళనలను బైడెన్ ప్రస్తావించే అవకాశం ఉందని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు. అయితే మానవ హక్కుల అంశంపై మోడీకి ఉపన్యాసాలు మాత్రం ఇవ్పుబోరని సుల్లివన్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+