వైట్ హౌస్ వద్ద కాల్పులు.. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి..
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇది ఉగ్రవాద చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని రెహమానుల్లా లఖన్ వాల్(29) గా గుర్తించారు. ఇతడు ఆఫ్గానిస్తాన్ కు చెందిన వ్యక్తి అని స్పష్టం అయింది. ఇదే విషయంపై ట్రంప్ మాట్లాడుతూ.. ఆ దుండగుడు లఖన్ వాల్ అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కాలంలోనే అమెరికాలోకి ప్రవేశించినట్లు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన అధికార నివాసాల్లో అమెరికా అధ్యక్ష భవనం ఒకటి. అయితే తాజాగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడిలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ కు తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడికి పాల్పడింది ఆఫ్గానిస్తాన్ కు చెందిన రెహమానుల్లా లఖన్ వాల్ గా అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఉగ్రవాద కుట్రగా అభివర్ణించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కాలంలోనే ఆఫ్గానిస్తాన్ నుంచి వలసవాదులు అమెరికాకు వచ్చారని దుయ్యబట్టారు. బైడెన్ పాలనా సమయంలో వచ్చిన ప్రతి ఆఫ్గాన్ పౌరుడిని మరోసారి పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే అమెరికా అధ్యక్ష భవనం వద్ద సెక్యూరిటీని టైట్ చేయాలని ఆదేశించారు. మరో 500 మంది అదనంగా నేషనల్ గార్డ్స్ ను మోహరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇది టార్గెటెడ్ షూటింగ్ అని డీసీ మేయర్ మురియల్ బౌసర్ పేర్కొన్నారు. డీసీ పోలీస్ చీఫ్ జెఫ్ రీ కరోల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడ్ని కస్టడీలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆఫ్గానిస్తాన్ కు చెందిన రెహమానుల్లా లఖన్ వాల్.. ఆఫ్గానిస్తాన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ కు చెందినవాడుగా గుర్తించారు. అతనికి భార్య.. ఐదుగురు పిల్లలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications