యుద్దాన్ని ఆపే సత్తా మోదీకే ఉంది- అంగీకరించిన అమెరికా..!!
యుద్ధం ఆపేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఒప్పించగలరని జాన్ కిర్బీ విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత ప్రధాని ప్రధాని మరోసారి వార్తల్లో ప్రపంచ వ్యాప్త వార్తల్లో నిలిచారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి ఏడాది అవుతోంది. ఈ కాలంలో పలుమార్లు ఈ యుద్దం ఆపటానికి ప్రధాని మోదీ చొరవ తీసేకోవాలంటూ పలువురు అభ్యర్ధించారు. యుద్దం ఆపగల సామర్ధ్యం మోదీకి ఉందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ సైతం నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడారు. యుద్దం పరిష్కారం కాదని సూచించారు. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పలుమార్లు ప్రధానితో ఫోన్ మంతనాలు చేసారు. ఇక, ఇప్పుడు ఇదే అంశం పైన అమెరికా శ్వేత సౌధం స్పందించింది. యుద్దం ముగించేలా పుతిన్ ను భారత ప్రధాని మోదీ ఒప్పించగలరా అనే ప్రశ్నకు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు.
యుద్ధం ఆపగలగడంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక పాత్ర పోషించగలరని, యుద్ధం ఆపేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఒప్పించగలరని జాన్ కిర్బీ విశ్వాసం వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి పునరుద్ధరణకు చేపడుతున్న ఎటువంటి చర్యలనైనా అమెరికా స్వాగతిస్తుందని జాన్ కెర్బీ అన్నారు. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సమావేశం నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనంలో అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా చేస్తున్న దాడుల వల్ల ఉక్రెయిన్ దేశవాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని జాన్ కెర్బీ ప్రస్తావించారు. ఉక్రెయిన్ దేశపు మౌలిక సదుపాయాలపై మిసైల్ దాడులు చేస్తు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని జాన్ కెర్బీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటువంటి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చర్చలకు సిద్ధపడడం స్వాగతించదగ్గ పరిణామమని జాన్ కిర్బీ అన్నారు. అదే సమయంలో పుతిన్ యుద్దాన్ని నిలిపివేసేందుకు ఇంకా సమయం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణను ఆపాల్సిన సమయంలో క్షిపణలను ప్రయోగిస్తున్నారని ఆక్షేపించారు. గత ఏడాది ఉజ్బెకిస్థాన్ లో జరిగిన ఎస్సీవో సదస్సులో భాగంగా ప్రధాని రష్యా అధ్యక్షుడు పుతిన్ లో చర్చించారు. యుద్దానికి తగిన సమయం కాదని హితవు చెప్పారు. ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మోదీని ప్రశంసించారు. ఇప్పుడు మరోసారి అమెరికా శ్వేత సౌధం ప్రతినిధి యుద్దం ముగింపుకు పుతిన్ ను ఒప్పించే సత్తా మోదీకి ఉందంటూ వ్యాఖ్యానించటం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications