WHO: మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మరో మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి కరోనా వేరియంట్ కొవిడ్-19 కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం 7 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ -19 ఇకపై ప్రపంచ అత్యవసర పరిస్థితి కాదని.. అయినప్పటికీ ఈ కరోనా పూర్తిగా తొలిగిపోలేదని టెడ్రోస్ చెప్పారు.
UN ఏజెన్సీ నిర్ణయాధికార సంస్థ 76వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో టెడ్రోస్ మాట్లాడారు. "COVID-19ని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ముగించడం, ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించే COVID-19 ముగింపు కాదు" అని అన్నారు."వ్యాధి, మరణాల పెరుగుదలకు కారణమయ్యే మరొక వేరియంట్ ముప్పు పొంచి ఉంది. ఇది ప్రాణాంతకమైనది ఉండొచ్చు" అని అతను తెలిపారు. దీని వల్ల భారీగా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండొచ్చని హెచ్చరించారు.

మరిన్ని సంక్షోభాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న తరుణంలో.. తదుపరి మహమ్మారి తలుపుతట్టిన వెంటనే నిర్ణయాత్మకంగా, సమిష్ఠిగా, సమానంగా తక్షణమే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. "మహమ్మారి మనం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను పరిష్కరించే, ప్రతిస్పందించే ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాంగాల అవసరం " WHO హెడ్ స్పష్టం చేశారు. కోవిడ్-19 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలకు 2030 గడువును కలిగి ఉందని టెడ్రోస్ చెప్పారు.
ఈ మహమ్మారి 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ప్రకటించిన ట్రిపుల్ బిలియన్ లక్ష్యాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో.. తదుపరి మహమ్మారిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ఇదే సరైన సమయమనని టెడ్రోస్ అన్నారు. మహమ్మారి ప్రపంచ సమాజానికి చేసిన నష్టాన్ని గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాపారాలను విచ్ఛిన్నం చేసిందని, మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టిందని అన్నారు.












Click it and Unblock the Notifications