• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో కరోనాపై డబ్ల్యుహెచ్‌వో విచారణ అప్‌డేట్స్: రష్యా వ్యాక్సిన్ వద్దు, డ్రాగన్ దేశంలో పెరిగిన..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉండగా.. కేసులు పెరుగుతోన్నాయి. అయితే వైరస్ ఆవిర్భావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫోకస్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో వైరస్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇదివరకు డబ్ల్యుహెచ్‌వో విచారణ జరిపింది. తాజాగా మరోసారి వైరస్ పుట్టుక నుంచి స్టడీ చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీలో వివిధ దేశాలు/ ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నాయి. వుహాన్‌లో మరోసారి కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆ దేశంలో వైరస్ సమూలంగా నిర్మూలన కాలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

మరోసారి విచారణ..

మరోసారి విచారణ..

కరోనాకు కేరాఫ్ అడ్రస్ చైనా అని అగ్రరాజ్యం అమెరికా సహా పలుదేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్ ఆవిర్భావంపై విచారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఇన్వెస్టిగేటివ్ టీమ్ చైనా వెళ్లి విచారిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ టెడ్రోస్ అథనామ్ గెబ్రియెసస్ వెల్లడించారు. వైరస్ మూలాలను కనుగొనే యత్నంలో చైనాలో గ్రౌండ్‌వర్క్‌ పూర్తి చేశామని వివరించారు. వైరస్ మూలాలు కనుగొనడానికి అవసరమైన ఉమ్మడి యత్నాలను టీమ్ ముమ్మరం చేయనుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ సోకడానికి కారణమైన మూలాన్ని కనుగొనే పనులను వూహాన్‌లోని ఎమిడెమియలాజికల్ స్టడీస్ ప్రారంభిస్తుందని టెడ్రోస్ చెప్పారు. మరోవైపు రష్యా వ్యాక్సిన్ తమకొద్దు అని అమెరికా తేల్చిచెప్పింది.

రష్యా వ్యాక్సిన్ వద్దు

రష్యా వ్యాక్సిన్ వద్దు

రష్యా వైరస్ వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసే దశలో ఉంది. వీలైనంత త్వరగా మార్కెట్లోకి వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంంది. చైనాకు చెందిన మూడు కంపెనీలు కూడా వ్యాక్సిన్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రజెనికా సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ తుది పరీక్షలకు చేరుకుంది. ఒకేసారి ఐదు కంపెనీల నుంచి కరోనా వ్యాక్సిన్స్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. రష్యా వ్యాక్సిన్ తయారీపై మొదటి నుంచి అమెరికా ఆరోపణలు చేస్తోంది. తమ శాస్త్రవేత్తల పరిశోధనలను హ్యాక్ చేశారని, వ్యాక్సిన్ తయారీలో అనేక దశలను బుట్టదాఖలు చేశారని ఆరోపిస్తోంది. చైనా, రష్యా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌లోపు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని రష్యా ప్రకటించగా.. తమకు వద్దు అని అమెరికా తేల్చిచెప్పింది.

ప్రజల ప్రాణాలతో చెలగాటం..

ప్రజల ప్రాణాలతో చెలగాటం..

అమెరికాకు చెందిన నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ రెగ్యులేటరీ పారదర్శకంగా లేని దేశాల టీకాలను అమెరికా స్వీకరించదని తేల్చిచెప్పారు. చైనా, రష్యా టీకాలను ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో వినియోగించబోమన్నారు. టీకాపై సరైన ప్రయోగాలు చేపట్టకుండా మార్కెట్లోకి తీసుకొస్తున్నారని.. దీంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని మిగతా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనాలో కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.

Recommended Video

PL 2020: Telugu States Cricketers in This Season | Oneindia Telugu
వుహన్‌లో మళ్లీ వైరస్

వుహన్‌లో మళ్లీ వైరస్

కరోనా వైరస్ వెలుగుచూసిన వుహాన్‌లో మళ్లీ కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36 మందికి వైరస్ వచ్చిందని చైనా జాతీయ కమిషన్ వెల్లడించింది. 30 కేసులు స్థానికంగా రాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఆరుగురికి సోకిందని చైనా తెలిపింది. జింగ్ జియాంగ్ ప్రావిన్సులో కరోనా కేసులు బయటపడుతున్నాయని చైనా వైద్యాధికారులు చెప్పారు. చైనాలో మొత్తం 84,464 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగడా... 4,634 మంది మరణించారు.

English summary
WHO team to be inquire coronavirus birth in wuhan city. one team come to city and research virus birth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X