నాడు నెతన్యాహుకు సైన్యాధ్యక్షుడు.. నేడు ఇజ్రాయెల్ ప్రధాని: ఎవరీ ఐసెన్‌కోట్?

ఇజ్రాయెల్ లో దశాబ్దాల కాలం పాటు కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పాలనా శకానికి తెరపడనుంది. ఆయన పదవి కోల్పోయారు. మాజీ కానున్నారు. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు గడీ ఐసెన్‌కోట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐసెన్‌కోట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తనకు మద్దతు ఇస్తోన్న పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన జాబితాను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కు అందజేయగా.. దీన్ని ఆయన ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్ ను ఆహ్వానించారు.

నూతన ప్రధానిగా గాదీ ఐసెన్‌కోట్ ప్రమాణస్వీకారం చేసే తేదీ, సమయం తదితర వివరాలను ఇజ్రాయెల్ అధ్యక్ష భవనం త్వరలోనే ప్రకటించనుంది. కిందటి నెల 27వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గడీ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 120 మంది సభ్యులుండే ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 మంది సభ్యుల మెజారిటీ అవసరం.

Who is Gadi Eisenkot all set to take Oath as Next Israel Prime Minister after Benjamin Netanyahu

ఐసెన్‌కోట్ కూటమి సొంతంగా 48 స్థానాలు సాధించింది. ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుతో స్పష్టమైన మెజారిటీ సాధించగలిగింది. ఈ నూతన కూటమి ఏర్పాటులో అరబ్ రాజకీయ పార్టీల మద్దతు నిర్ణయాత్మకంగా మారింది. జాయింట్ లిస్ట్‌లోని హదాష్, తాల్, బలద్ పార్టీలతో పాటు వేరుగా పోటీ చేసిన రాహెమ్ పార్టీకి చెందిన మొత్తం 19 మంది అరబ్ పార్లమెంట్ సభ్యులు ఐసెన్‌కోట్‌కు తమ మద్దతు తెలిపారు. వారి సంతకాలు, లేఖలను అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సమర్పించడంతో ఐసెన్‌కోట్‌కు అనుకూలంగా ఉన్న ఎంపీల మొత్తం సంఖ్య 67కు చేరింది.

నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!
నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!

దీంతో ఇక ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా గడీ ఐజెన్‌కోట్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైంది. ఇజ్రాయెల్ లో స్థిరపడిన మొరాకో మూలాలున్న కుటుంబంలో జన్మించారాయన. 2015 నుండి 2019 వరకు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2006 లెబనాన్ యుద్ధ సమయంలో హమాస్, హెజ్బొల్లా వంటి సాయుధ గ్రూపులను అణచివేసి వార్తల్లో నిలిచారు. ఆర్మీలో దాదాపు 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించిన అనుభవం ఆయనకు ఉంది.

పండగ సీజన్ లో పసిడి ధరల్లో అనూహ్య పరిణామాలు
పండగ సీజన్ లో పసిడి ధరల్లో అనూహ్య పరిణామాలు

ఈ సుదీర్ఘ మిలిటరీ నేపథ్యమే ఇప్పుడు నెతన్యాహుకు బలమైన ప్రత్యామ్నాయ నేతగా నిలవడానికి దోహదపడింది. ఐసెన్ కోట్ సాధించిన సైనిక విజయాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. గాజాలో జరిగిన సైనిక చర్యల్లో ఐసెన్‌కోట్ కుటుంబం భారీగా నష్టపోయింది. నాటి యుద్ధంలో పోరాడుతూ ఆయన కుమారుడు, ఇద్దరు మేనల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు.. దేశ రక్షణ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ఇజ్రాయెల్ ప్రజల్లో నాటుకు పోయేలా చేసింది. ఆయన పట్ల సానుభూతి, నమ్మకాన్ని పెంపొందించింది.

రూట్ మార్చిన ప్రధాని మోదీ: సరిహద్దులకు బదులుగా మావోయిస్టుల కంచుకోటలో
రూట్ మార్చిన ప్రధాని మోదీ: సరిహద్దులకు బదులుగా మావోయిస్టుల కంచుకోటలో

సంపూర్ణ అణు సామర్థ్యాన్ని సాధించకుండా ఇరాన్ ను అడ్డుకోవడం, జోర్డాన్ రివర్ నుండి మధ్యధరా సముద్రం వరకు ఉన్న మొత్తం భూభాగంపై ఇజ్రాయెల్ నియంత్రణ ఉండాలనేది ఆయన ఆకాంక్ష. దీనికి అనుగుణంగా తాను పని చేస్తానని గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందని తాజాగా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+