Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US: మేయర్ రేసులో తొలి భారత మహిళ. ఎవరీ రిని సంపత్?

అమెరికా రాజకీయ యవనికపై ఒక భారతీయ సంతతి మహిళ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రపంచ అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington D.C.) మేయర్ పీఠం కోసం జరుగుతున్న పోరులో 'రిని సంపత్' అనే 31 ఏళ్ల భారతీయురాలు చరిత్ర తిరగరాశారు. ఏడేళ్ల వయసులో ఒక సామాన్య వలసదారుగా అమెరికాలో అడుగుపెట్టిన రిని, నేడు అదే దేశ రాజధానికి మేయర్ అయ్యే దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు.

వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బ్యాలెట్‌లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా రిని సంపత్ రికార్డు సృష్టించారు.ఇవాళ ఆమె ప్రచార బృందం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. సాధారణంగా అక్కడి బ్యాలెట్‌కు అర్హత సాధించడం అంత సులభం కాదు, కానీ రిని సంపత్ ఏకంగా 4,500 మందికి పైగా నివాసితుల సంతకాలను సేకరించి తన ప్రజాదరణను చాటుకున్నారు. "అమెరికన్ డ్రీమ్ కోసం చిన్నతనంలో ఇక్కడికి వచ్చాను.. ఇప్పుడు డీసీ నివాసితుల కలలను నెరవేర్చడమే నా లక్ష్యం" అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు.

Who is Rini Sampaht Meet the First South Asian Woman on the Washington DC Mayor Ballot 2026

తమిళనాడు నుంచి వాషింగ్టన్ వరకు..

తమిళనాడులోని తేనిలో జన్మించిన రిని సంపత్, తన ఏడేళ్ల వయసులో తండ్రితో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో అంతర్జాతీయ సంబంధాలు, భద్రతా అధ్యయనాల్లో విద్యనభ్యసించిన ఆమె, గత దశాబ్ద కాలంగా వాషింగ్టన్ డీసీలోనే నివసిస్తున్నారు. వృత్తిరీత్యా సైబర్‌సెక్యూరిటీ నిపుణురాలిగా, ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న రిని, ప్రస్తుతం 'థారస్' (Tharus) సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన తాతగారే తనకు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన స్ఫూర్తి అని ఆమె గర్వంగా చెబుతారు.

భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్.. వాషింగ్టన్ భేటీ వాయిదా!
భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్.. వాషింగ్టన్ భేటీ వాయిదా!

'Fix the Basics'.. సామాన్యుడి గొంతుకగా రిని

రాజకీయ నేపథ్యం లేని ఒక 'అవుట్‌సైడర్' (Outsider) గా రిని సంపత్ తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. "నేను రాజకీయ నాయకురాలిని కాదు, నాకు ప్రత్యేక గ్రూపులకు బాకీ పడాల్సిన అవసరం లేదు" అంటూ ఆమె స్పష్టం చేశారు. 'Fix the Basics', 'A New DC' అనే నినాదాలతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. నగరంలో ప్రాథమిక సేవలను మెరుగుపరచడమే తన అజెండా అని ఆమె ప్రకటించారు. రోడ్లపై గుంతలు పూడ్చడం, పొటోమాక్ నదిలో మురుగునీటి లీకేజీని అరికట్టడం, పెరిగిన ధరలను తగ్గించడం మరియు 911 ఎమర్జెన్సీ సేవల నిరీక్షణ సమయాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు.

Indian Teacher: విద్యా విప్లవంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత మహిళ
Indian Teacher: విద్యా విప్లవంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత మహిళ

మేయర్ పీఠం కోసం హోరాహోరీ పోరు..

ప్రస్తుత మేయర్ ఎన్నికల్లో రిని సంపత్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. జేనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్‌డఫీ వంటి హేమాహేమీలు బరిలో ఉన్నప్పటికీ, రిని సంపత్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రాజకీయ చదరంగంలో ఒక భారతీయురాలు, అది కూడా యువ మహిళ మేయర్ బ్యాలెట్ వరకు వెళ్లడం అక్కడి ప్రవాస భారతీయులకు గర్వకారణంగా మారింది. 2026 మేయర్ ఎన్నికల్లో రిని సంపత్ విజయం సాధిస్తే, అది అమెరికా రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+