వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎఫ్ 16 వాడలేమని పాకిస్థాన్ ఎందుకు చెప్పిందంటే ? అమెరికా ఆగ్రహానికి గురికాకుడదనే ..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారత సైనిక స్థావరాలపై దాడికి తెగబడింది పాకిస్థాన్. నిలువరించింది వింగ్ కమాండర్ అభినందన్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇందుకోసం పాకిస్థాన్ ఆధునాతన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించింది. దీనికి సంబంధించి భారత్ ఆధారాలను కూడా మీడియాకు చూపించింది. భారత్ పై దాడిచేసిన పాకిస్థాన్ ఎందుకు అబద్ధం చెప్పింది ? కారణం ఏమై ఉంటుంది.

పాక్ ఇవిగో అమ్రామ్ క్షిపణి శకలాలు

పాక్ ఇవిగో అమ్రామ్ క్షిపణి శకలాలు

ఎఫ్ 16 యుద్ధ విమానాలు మాత్రమే అమ్రామ్ క్షిపణిని ప్రయోగిస్తాయి. భారత్ పై దాడిచేసిన సమయంలో పడిపోయిన అమ్రామ్ శకలాలను త్రివిధ దళాల ఉన్నాతాధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎఫ్ 16 యుద్ధ విమానం వాడినందుకు సాక్షమిదిగో అని ప్రపంచానికి చాటారు. దీంతో పాకిస్థాన్ చెబుతోంది పచ్చి అబద్దమని స్పష్టమవుతోంది.

పాకిస్థాన్ ఎందుకు చెప్పడం లేదంటే ..

పాకిస్థాన్ ఎందుకు చెప్పడం లేదంటే ..

సాధారణంగా ఆధునాతన యుద్ధం విమానాలతో దాడి చేస్తే విచారణ క్రమంలో అంగీకరిస్తారు. మరి పాకిస్థాన్ ఎందుకు తటపటయిస్తోంది. కారణం ఏంటంటే .. ఎఫ్ 16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు, విద్రోహశక్తులను అంతం చేసేందుకు మాత్రమే వీటిని ఉపయోగిస్తామని కొనుగోలు సమయంలో జరిగిన ఒప్పందంపై పాకిస్థాన్ సంతకం చేసింది. ఏ దేశంపైకి ప్రయోగించమని స్పష్టంచేసింది. ఇటీవల అందుకు విరుద్దంగా ప్రయోగించడంతో అమెరికాకు ఇచ్చిన హామీని విస్మరించినట్లే అవుతోంది. ఈ విషయం అమెరికాకు తెలిస్తే కొత్త రక్షణ ఉత్పత్తుల కొనుగోలు చేయడం కష్టమవుతోంది. అందుకే తాము ఎఫ్ 16 యుద్ధ విమానాలను వాడలేదని బుకాయిస్తోంది. దీనికితోడు 2016లో ఎఫ్ 16 విమానాలను భారత్ పైకి ప్రయోగించే ముప్పు ఉందని ఆందోళన నేపథ్యంలో 8 ఎఫ్ 16 విమానాలను అమెరికా చట్టసభ సభ్యులు అడ్డుకున్నారు.

నిశీతంగా గమనిస్తున్నాం

నిశీతంగా గమనిస్తున్నాం

పాకిస్థాన్ చర్యలను నిశీతంగా గమనిస్తున్నామని అమెరికా పేర్కొంది. భారత్ పైకి ఎఫ్ 16 ప్రయోగించని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. ఈ అంశంఫై ఫోకస్ చేశామని తెలిపింది. భారత్ సమర్పించే ఆధారాలు, శకలాల పరిశీలన తర్వాత చర్యలు తప్పవని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

English summary
Generally attacked by advanced warplanes will be accepted in the course of the trial. And why is Pakistan so lenient? The reason is that F-16 warplanes were bought from Pakistan. Pakistan has signed on the deal at the time of purchase when it will use terrorists to fight terrorism and end the looting. It is clear which country to use. Recently, it has been neglected by the promise of the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X