పక్కా ప్లాన్‌తో మోడీ కొట్టిన దెబ్బ!: విజయ్ మాల్యా కాళ్ల బేరానికి రావడం వెనుక..?
Recommended Video

లండన్: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మెట్టు దిగి, తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు, తాను రెండేళ్ల క్రితమే ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు రుణాలు చెల్లిస్తానని లేఖ రాశానని, కాని వారి నుంచి స్పందన రాలేదని చెబుతూ.. కేంద్రంపైకి తప్పు నెట్టే ప్రయత్నం చేశారు.

మాల్యా ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?
కానీ, రెండేళ్ల క్రితం రాసిన లేఖను విజయ్ మాల్యా ఇప్పుడు ఎందుకు బయటపెట్టారు? ఇన్నాళ్లు ఎందుకు దానిపై మాట్లాడలేదు? సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని ఇరుకున పడేసేందుకు ఇప్పుడు ఈ లేఖలు విడుదల చేశారా? లేక మరోదైనా ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. మాల్యా లేఖ రాసినా.. అతనితో పాటు అతని లాంటి వారి నుంచి రుణాలు వసులు చేసేందుకు కొత్త చట్టం కోసం మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని అంటున్నారు. ఆ చట్టం రావడంతో మాల్యా ఇప్పుడు దిగొచ్చారని చెబుతున్నారు.

కఠిన చట్టాలు
మోడీ హయాంలో ఆర్థిక నేరస్థులకు కఠినంగా మారుతున్న చట్టాలే మాల్యా తగ్గడానికి కారణం అంటున్నారు. గత ఏడాది దివాలా, బ్యాంక్రప్టసీ చట్టంలో కీలక సవరణలు చేశారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు, కంపెనీల ఆటకట్టించేందుకు ఈ సవరణలు చేపట్టింది. ఈ సవరణలకు పార్లమెంట్‌కు ఆమోద ముద్ర వేసింది. మరోవైపు, ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్, బినామీ లావాదేవీల చట్టం కూడా అమల్లోకి వచ్చింది.

మాల్యాను రప్పించే ప్రయత్నాలు
ఓ వైపు చట్టాలు కఠినంగా తయారు చేస్తూ.. మరోవైపు మాల్యా, నీరవ్ మోడీ వంటి వారిని భారత్ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మాల్యా 2016 దేశం విడిచి పారిపోయాడు. అతని కోసం వెతగ్గా.. లండన్‌లో గుర్తించారు. స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నించింది. మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది.

మాల్యాపై బీజేపీ ఆగ్రహం
మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రస్తుతం బ్రిటన్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు తుది విచారణ జులై 31న జరగనుంది. మరో కేసు కూడా తుది దశకు చేరకుంది. ఈ కారణాల వల్లే మాల్యా తాజా ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. ఇదిలా ఉండగా, రెండేళ్ల క్రితం లేఖ రాశానని, మోడీ స్పందించలేదన్న మాల్యాపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications