ఆసక్తికరం: భర్త శవంతో టూర్, రోజుల కొద్దీ ప్రయాణం

Posted By:
Subscribe to Oneindia Telugu

అలస్కా: ఓ మహిళ తన భర్త మృతదేహంతో పర్యటన చేసింది. ఆమె తన భర్త మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచింది. దానిని తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లింది. శవం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా ఎప్పుడూ మంచును ఉపయోగించింది.

అయితే, అమెరికాలోని అలస్కాలో ఆమె శవంతో తిరుగుతుండటంతో కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె భర్త శవంతో కొన్ని రోజులుగా ప్రయాణం చేస్తోందని, వాహనంలోని మృతదేహం ఉన్న పేటికలో మంచు అయినప్పుడల్లా దానిని కొనేందుకు మాత్రమే వాహనాన్ని ఆపేది.

Widow takes dead husband on road trip in Alaska

భర్త మృతదేహాన్ని ఆమె నేరుగా మార్చురీకి తీసుకెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల తీసుకెళ్లకెళ్లలేదని, భర్తతో కలిసి కొన్ని రోజులు ప్రయాణాలు చేయాలని ఉద్దేశంతో ఆమె ఇలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. స్థానికంగా రోలింగ్ వేక్ వార్షిక ఉత్సవం జరుగుతుండటంతో భర్తతో కలిసి ఆ ఉత్సవానికి వెళ్లాలని ఆమె ఇలా చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

ఆమె భర్త సహజంగానే మరణించారని, ఈ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి అభియోగాలు లేవని పోలీసులు చెప్పారు. ఆమె భర్త శవాన్ని స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న మార్చురీకి తరలించామని, మళ్లీ తన భర్త శవం కోసం ఆమె రాదని భావిస్తున్నామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An American woman took her dead husband’s body on road trip in Alaska, using ice from local canneries to keep the corpse cold, police have said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X