లిక్కర్ కేసులో ఈడీ దూకుడు, హిట్ లిస్టులో..!!

లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సోదాలు.. విచారణలు చేస్తున్న ఈడీ ఒక్క సారిగా అరెస్టులు చేయటం మొదలు పెట్టింది. లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పది మంది నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఇదే సమయంలో ఏ-1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అదుపు లోకి తీసుకున్న ఈడీ.. ఇదే కేసులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడిని విచారిస్తున్నారు. దీంతో.. ఒక్క సారిగా ఈడీ దూకుడు చూస్తుంటే.. ఎలంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ కనిపిస్తోంది.

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఈ రోజు ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సిట్ పలువురిని విచారణ చేసి అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ .. హవాలా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో నాటి బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని విచారణ చేస్తున్నారు. పది మంది నివాసాలు.. కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు వారిని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేస్తోంది. ఇప్పటికే వారి విచారణలో సేకరించిన సమాచారం తో పాటుగా గుర్తించిన నగదు లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ కేసులో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను గుర్తించారు. వందల కోట్ల మేర అక్రమంగా లావాదేవీలు గుర్తించిన అధికారులు ఈ దిశగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

లిక్కర్ కేసులో ఈడీ తొలి అరెస్ట్, నెక్స్ట్ ఇక..!!
లిక్కర్ కేసులో ఈడీ తొలి అరెస్ట్, నెక్స్ట్ ఇక..!!
enforcement-directorate-arrests-ysrcp-leader-karumuri-nageswara-rao-in-liquor-case-here-the-details

లిక్కర్ రవాణా కేసులో లావాదేవీలు

కాగా, ఇదే కేసుల మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావును గతంలో సిట్ విచారణ చేసింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి పైన అభియోగాలు ఉన్నాయి. వందల కోట్ల మేర లావా దేవీలు నిర్వహించినట్లు విచారణలో గుర్తించారు. మద్యం రవాణా, టెండర్లు సబ్ కాంట్రాక్టుల అవకతవకల విషయంలో కారుమూరిపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మద్యం రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.200 నుంచి రూ. 250 కోట్ల వరకు గండి కొట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన కుమారుడిని ఈడీ లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజ్ కేసిరెడ్డితో పాటుగా కారుమూరి కుమారుడిని ఈడీ అధికారులు విచారణ చేస్తుండటంతో... ఇప్పుడు ఎవరి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+