• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మసూద్ ను మళ్లీ కాపాడిన చైనా .. ఇంకా చైనా వస్తువులు కొంటారా ?

|

హైదరాబాద్ : యువతకు శిక్షణ ఇచ్చి, ఆత్మాహుతిగా మార్చి భారతదేశంపై దాడులకు తెగబడుతోన్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పై డ్రాగన్ చైనా మళ్లీ మెతక వైఖరి అవలంభించింది. మసూద్ ను ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు మద్దతు తెలుపక తన కపట వైఖరిని మరోసారి చాటుకుంది. ఈ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయానికి వచ్చేందుకు మరింత సమయం కావాలని పేర్కొనడం .. సాంకేతిక కారణాలు చూపడం డ్రాగన్ మెతక వైఖరికి అద్దం పడుతోంది.

రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?

దోషిగా నిలబెడతామంటే .. అడ్డొస్తోన్న డ్రాగన్

దోషిగా నిలబెడతామంటే .. అడ్డొస్తోన్న డ్రాగన్

భారత పార్లమెంట్ నుంచి పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్, యూరీ, పుల్వామా దాడులు చేసి పదుల సంఖ్యలో జవాన్ల మృతికి కారణమైంది జైషే మహ్మద్. ఈ క్రమంలోనే ఆ సంస్థను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు భారత్ గట్టి ప్రయత్నాలు చేపట్టింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, రష్యా దేశాల మద్దతు కూటగట్టింది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేయాలని భావిస్తోన్న ఆ దేశాలు భారత్ కు మద్దతిచ్చి ప్రతిపాదన సిద్ధం చేస్తే కుళ్లు, కుతంత్రాలు, కుట్రల చైనా అడ్డుతగిలింది. దీంతో భారతదేశంలో చైనా వస్తువులు ఎందుకు కొనుగోలు చేయాలనే వాదన తెరపైకి వచ్చింది.

చైనా వస్తువులు నిషేధం ?

చైనా వస్తువులు నిషేధం ?

భారతదేశంపై దాడికి తెగబడుతున్న ఉగ్రవాద సంస్థకు చైనా ఎందుకు మద్దతు తెలుపుతోంది. మసూద్ మీద అభిమానం లేదంటే పాకిస్థాన్ మీద ప్రేమ అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే చైనా వస్తువులను నిషేధం విధించాలనే డిమాండ్ వస్తోంది. తమ దేశంపై దాడికి జరిపి జవాన్ల మృతికి కారణమైన చైనా ఉత్పత్తులను కొనడం ఏంటనీ చర్చ జరుగుతోంది. మన దేవాలయం లాంటి పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థను దోషిగా నిలబెట్టే ప్రయత్నానికి డ్రాగన్ మోకాలడ్డడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. దీనికంతటికీ కారణం మన దేశంలో విక్రయిస్తున్న చైనా వస్తువలపై మూకుమ్మడిగా నిషేధం విధించాలని .. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ వస్తోంది.

ఆర్థికంగా దెబ్బకొట్టడమే మేలు ?

ఆర్థికంగా దెబ్బకొట్టడమే మేలు ?

ఒక దేశ అభివృద్ధి ఆ దేశం యొక్క ఉత్పత్తి .. పంపిణీ ద్వారానే సాధ్యమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో మార్కెట్ పోటీ నెలకొంది. ఈ క్రమంలో డ్రాగన్ చైనా తక్కువ ధరకే వస్తువులను విక్రయించి .. సొమ్ముచేసుకుంటుంది. తక్కువ ధరకు వస్తోంది కదా అని .. అందరూ చైనా వస్తువులను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ సమయంలో చైనా వస్తువులను బ్యాన్ చేస్తే .. ఆర్థికంగా దెబ్బకొట్టొచ్చని వాదన తెరపైకి వచ్చింది. దీంతో డ్రాగన్ కు బుద్ధి వచ్చి .. తన కుటిల, కుతంత్రం తెలుసుకొనే వీలుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా గుండు పిన్ను నుంచి విమాన తయారీ పరికరాల వరకు చైనా వస్తువులను నిషేధించి .. మరోసారి వక్రబుద్ధి చూపించాలంటేనే భయపడేలా చేయాలని సామాజిక మాధ్యమాల్లో యూజర్లు కోరుతున్నారు.

మాపై దాడి చేసేవారికి సపోర్ట్ చేయడమేంటీ ?

మాపై దాడి చేసేవారికి సపోర్ట్ చేయడమేంటీ ?

బారతదేశంపై దాడి చేసే ఉగ్రవాద సంస్థలకు చైనా మద్దతు తెలుపడం ఏంటనే అంశంపై జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మీ వస్తువుల కొనుగోలు చేసి .. మీ ఆర్థికావృద్ధి పెంచితే అందుకు మీరిచ్చే కానుకా ? భారత్ పై దాడులు చేసేవారికి వెన్నుదన్నుగా నిలువడమా ? చైనా అభివృద్ధికి ఇతోధికంగా భారత్ సాయం చేస్తుండగా ... ఆ దేశ కుటిల నీతిని బయటపెడుతూనే ఉందని విమర్శలు వస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why is China supporting the terrorist organization being attacked on the country? Dragon Moleddy has been criticized for its attempt to save off a terrorist organization that attacked Parliament, such as our temple to attack China's ban on products. Demand for ban on China's goods sold in our country is prohibited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more