వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేయను, చివరి బంతి వరకు పోరాటం, విదేశీశక్తలు ప్రమేయం: ఇమ్రాన్ ఖాన్ స్పీచ్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న క్రమంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో తనపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో గురువారం దేశ ప్రజలనుద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. దేశం ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉదని, ఈ సమయంలో తమ ముందున్న రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవికి రాజీనామా చేయడం లేదని, ఆఖరి బంతి వరకూ పోరాడతానని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్. పాక్‌ స్వాతంత్యం సాధించిన తర్వాత పుట్టిన మొదటి తరానికి నేను ప్రతినిధిని. ఇమ్రాన్​ ఖాన్​ను పదవి నుంచి దింపేయాలని, లేదంటే పాకిస్థాన్​ తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఓ దేశం సందేశం పంపించింది. నేను 20 ఏళ్ల పాటు క్రికెట్​ ఆడాను. చివరి బంతి వరకు ఆడతానని ప్రపంచంతో పాటు నాతో ఆడిన వారంతా చూశారు. ఓటమి ఎప్పటికీ అంగీకరించను. నేను ఇంట్లో కూర్చుంటానని ఎవరూ ఆలోచించొద్దు అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

 Will Not Resign, Foreign Country Working Against An Elected PM, says Imran Khan

అంతేగాక, ఫలితం ఎలా ఉన్నా.. మరింత బలంగా తిరిగొస్తా. నా చిన్నప్పుడు పాకిస్థాన్​ అగ్రస్థానంలో ఉండేది. దక్షిణ కొరియా ఇక్కడికి వచ్చి అభివృద్ధి గురించి తెలుసుకునేది. విదేశాల నుంచి మన యూనివర్సిటీల్లో చదువుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా వచ్చేవారు. మలేసియా యువరాణి నాతో పాటు చదువుకుంది. అవన్ని ఇప్పుడు క్షీణిస్తున్నాయి. నా దేశం అవమానాలకు గురవుతోంది అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

నాకు దేవుడు డబ్బు, మంచి జీవితంతో పాటు అన్నీ ఇచ్చాడు. అలాంటి జీవితంపై నాకు ఇప్పటికీ వ్యామోహం లేదు. పాకిస్థాన్ కు సంబంధించి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావని చాలామంది అడిగారు. మన దేశ నిర్మాతల విజన్ ను సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

ముస్లింలు ఎన్నటికీ బానిసలుగా ఉండరు. నేను చెప్పేది యువత జాగ్రత్తగా వినాలి. అల్లా మీకు ఎగిరేందుకు రెక్కలు ఇచ్చాడు... కానీ ఎందుకు చీమల్లా కింద పాకుతున్నారు? మనకు ఆ భగవంతుడు దేవతల స్థాయి కల్పించాడు. కానీ మనం భయాన్ని స్మరిస్తున్నాం. డబ్బును ప్రేమిస్తున్నాం. మనుషులమైన మనం చీమల్లా ప్రవర్తిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

చరిత్రలో పాకిస్థాన్ కీలక దశకు చేరుకుందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. "నాకంటే పాకిస్థాన్ ఐదేళ్లు పెద్దది. పాకిస్థాన్ తొలితరం వాళ్లలో నేనూ ఒకడ్ని. స్వాతంత్ర్యం వచ్చాక పుట్టినవాడ్ని. నాకు భారత్ లోనూ, అమెరికాలోనూ ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వారితో నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం, అజెండాలు లేవు. వారి విధానాలను మాత్రం ఖండించాను. ప్రధాని అయ్యాక ఏ ఒక్కరికో వ్యతిరేకంగా పాకిస్థాన్ వెళ్లరాదని భావించాను. భారత్ తోనూ మా గొడవ ఒక్కటే. కశ్మీర్‌లో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నదే మా బాధ అని మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ముగ్గురు మాయగాళ్లు విదేశీ శక్తులతో జట్టుకట్టారు. ఇమ్రాన్ ఖాన్ అనేవాడ్ని పదవి నుంచి తప్పించాలనేది వారి అజెండా. నేను లేకపోతే అన్ని చక్కబడతాయని వారు భావిస్తున్నారు. నేపాల్‌లో నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో రహస్యంగా భేటీ అయ్యారని బర్కా దత్ పుస్తకం చెబుతోంది అని అన్నారు. మరోసారి చెబుతున్నా... నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. 22 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం. నా మీద విమర్శలు కురిపిస్తున్న షాబాజ్ షరీఫ్... దేశంపై దాడులు జరుగుతున్న సమయంలో ఎక్కడున్నాడు? ఈ ఆదివారంతో అవిశ్వాస తీర్మానంపై ఓ నిర్ణయం వస్తుంది. దేశం మళ్లీ అవినీతిపరులు హస్తాల్లోకి వెళుతుందా? అనేది వెల్లడి కానుందన్నారు.

నేను దేశాన్ని భ్రష్టు పట్టించానంటున్నారు... కానీ నేను పాలించింది ఈ మూడేళ్లు. అయితే, ఈ మూడేళ్లలో నేను చేసినంత అభివృద్ధి గతంలో ఎన్నడైనా జరిగిందా? అని సవాల్ విసురుతున్నా? ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజీనాయా చేయబోవడంలేదు. చివరిబంతి వరకు పోరాడతాను. చూస్తాను... నన్ను ఓడించే క్రమంలో ఎవరెవరు తమ ఆత్మసాక్షిను తాకట్టు పెడతారో వేచిచూస్తాను" అంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

English summary
'Will Not Resign', Foreign Country Working Against An Elected PM, says Imran Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X