37మంది మృతి: విమాన శిథిల్లాలో ప్రాణాలతో చిన్నారి (ఫొటో)
జుబా: ఘోర విమాన ప్రమాదంలో ఓ 13 నెలల పసిపాప ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో 37మంది మృతి చెందగా.. ఈ చిన్నారి మృత్యుంజరాయురాలిగా నిలిచింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ పాప పేరు న్యాలో.
రెండ్రోజుల క్రితం దక్షిణ సుడాన్‌లో కార్గో విమానం కూలిపోయింది. సుడాన్‌కు చెందిన ఓ టెలివిజన్ ప్రజెంటర్ ముందుగా విమాన ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లింది. అక్కడ శిథిలాల్లో ఓ వ్యక్తి ఒడిలో చిన్నారి ఏడుస్తూ కనబడింది. ప్లేన్ కూలిన ఘటనలో మొత్తం 37 మంది మృతిచెందారు.

కాగా, ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ మరొకతను ఆ పాపను కాపాడిన వ్యక్తే. ఇద్దర్నీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాపను ఛాతికి అత్తుకు పట్టుకోవడం వల్లే చిన్నారిని రక్షించగలిగానని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి చెప్పాడు.
ప్రమాదంలో పాప తల్లి, అక్క చనిపోయారు. న్యాలోకు కాలు విరిగింది. నుదురుపై చిన్న దెబ్బ కూడా తగిలింది. సరుకు రవాణా విమానం ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications