మోసం: ప్రియుడి మర్మంగానికి వాతలు పెట్టింది
న్యూయార్క్: ఓ యువతి తనను ప్రేమించి మోసం చేసిన తన ప్రియుడిపై దారుణానికి ఒడిగట్టింది. ఆ వ్యక్తి పురుషాంగాన్ని హెయిర్ స్ట్రైటనర్‌తో కాల్చి వాతలు పెట్టింది. ఆస్ట్రేలియాలోని మౌంటర్ బార్కర్‌లో డిసెంబర్ 2013లో జరిగిన ఘటనపై ఇటీవలే అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. బ్రౌన్యన్ జాయ్ పార్కర్(22) అనే యువతి తన ప్రియుడిపై హెయిర్ స్ట్రైటనర్‌తో దాడి చేసింది. ఆమె కాల్చడంతో అతని మర్మంగానికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం అతను కోలుకున్నాడు.

తనను మోసం చేసిన కారణంగానే నిందితురాలి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. అయితే తాను చేసిన పని వల్ల బాధితుడికి తీవ్ర గాయాలు అవుతాయని నిందితురాలు అనుకోలేదని చెప్పారు.
‘నేను ఏదో చిన్న గాయమవుతుందని అనుకున్నా.. నిజంగా ఇంత తీవ్ర గాయాలవుతాయని అనుకోలేదు' అని నిందితురాలు తెలిపింది. కాగా, ఈ కేసు విచారించిన స్థానిక కోర్టు.. నిందితురాలికి 9 నెలల జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications