జాతివివక్ష: కూర్చొనేందుకు స్థలం అడిగితే, మీ దేశం వెళ్ళిపో, అస్ట్రేలియన్ మహిళ అహంకారం

Posted By:
Subscribe to Oneindia Telugu

సిడ్నీ: అస్ట్రేలియాలో భారతీయులకు మరో సారి వివక్ష ఎదురైంది. గర్భవతిగా ఉన్న ఓ మహిళను పక్కన కూర్చోబెట్టుకొనేందుకు నిరాకరించిన అస్ట్రేలియన్ మహిళ భారతీయ జంటను తీవ్రంగా అవమానపర్చింది.ఈ ఘటనను బాధిత కుటుంబం వీడియో తీసింది. దీనిపై అస్ట్రేలియా ప్రభుత్వం విచారణ చేపట్టింది.

అస్ట్రేలియాలో భారతీయులపై మరో జాతి వివక్ష ఘటన వెలుగుచూసింది. గర్భవతిగా ఉన్న తన భార్యను కాస్తంత పక్కన కూర్చోబెట్టుకొంటారా అని అడిగినందుకు ఉత్సవ్ పటేల్ అనే భారతీయుడు, అతడి కుటుంబానికి సిడ్నీలో చేదు అనుభవం ఎదురైంది.

Woman hurls racial abuse at Indian man and his pregnant wife in Sydney

సిడ్నీ మహిళ అతడిని, భారతీయులను భారత్ ను అనకూడని మాటలు అంది. ఈ మాటలకు ఉత్సవ్ నాలుగేళ్ళ కూతురు భయంతో చూస్తుండగా జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసింది. దీనిని ఉత్సవ్ తన కెమెరాలో రికార్డు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ లోని లూనా పార్క్ లో జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పార్క్ లో రైడింగ్ చేసేందుకు తన నాలుగేళ్ళ కూతురు, గర్భవతి అయిన భార్యతో కలిసి వెళ్ళాడు ఉత్సవ్. అయితే తన భార్య గర్భవతి కావడంతో కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత అతడు రైడింగ్ కు వెళ్ళివచ్చే సరికి ఒక బెంచీపై కూర్చొబెట్టాలని అనుకొన్నాడు.

అప్పటికే ఆ బెంచీపై అస్ట్రేలియన్ మహిళ ఉంది. ఆమెను కాస్తంత కూర్చొబెట్టుకొంటారా అని అడిగినందుకు ఆమె అనకూడని మాటలు అంది.వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపొండి అంటూ అస్ట్రేలియన్ మహిళ గోల చేసింది. తనకు భారతీయులంటే అస్సలు ఇష్టం లేదంటూ గట్టింగా అరిచింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Indian man and his family were racially abused by a woman at a theme park in Sydney, Australia, after he asked her if they could sit next to her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి