ప్రొఫెసర్‌ని కాల్చి ఇండియన్ సూసైడ్: కిల్ లిస్ట్‌లో భార్య, వెళ్లేసరికి మృతి?
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ (యూసీఎల్ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. ప్రొఫెసర్‌ను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు మూడువేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి వచ్చాడు. ఐఐటి ఖరగ్‌పూర్ (ఏరోస్పేస్ ఇంజినీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్.. యూసీఎల్ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవాడు. 2013లో డాక్టరేట్ పూర్తయింది.

కొంతకాలం తర్వాత తన కంప్యూటర్ కోడ్ చోరీ అయిందని గుర్తించిన ప్రొఫెసర్ విలియమ్ దీనిని మైనాక్ దొంగిలించి ఇతరులకు ఇచ్చాడని ఆరోపించారు. దీంతో మైనాక్ సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్ పైన బహిరంగ విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ దారుణం జరిగింది.
మిన్నెసొటాలోని మైనాక్ నివాసంలో సోదాలు నిర్వహించగా.. కిల్ లిస్ట్ లభించింది. ఇందులో ఒకరు ఇదే వర్సిటీ ప్రొఫెసర్. మరో మహిళ పేరును గుర్తించారు. అయితే, ఆమె చిరునామా ఆధారంగా ఇంటికి వెళ్లేసరికి ఆమె చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఆమె అతడి భార్య అయి ఉంటుందని భావిస్తున్నారు. అష్లీ హస్తి అనే మహిళతో మైనాక్‌కు 2011లో పెళ్లయింది. వాళ్లిద్దరూ ఇంకా కలిసి ఉంటున్నారా లేదా మాత్రం నిర్ధారణ కాలేద. బుధవారం జరిగిన ఈ హత్యతో వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు.
మైనాక్ వాస్తవానికి మరో ప్రొఫెసర్‌ను కూడా చంపాలని వెళ్లాడు. కానీ ఆ రెండో ప్రొఫెసర్ వర్సిటీలో లేరు. ఆ తర్వాత ఒకరిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వద్ద రెండు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications