ఏం నాయ‌నా... ఇంకో ల‌డ్డూ కావాలా? ఏదీ.. ఈ వీడియో చూసి అడుగు!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: స్వీట్స్ అంటే ఇష్ట‌ప‌డని వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో. కాక‌పోతే.. స్వీట్ల‌లో చాలా మందికి వాళ్ల వాళ్ల అభిరుచులు ఉంటాయి. కానీ.. మొత్తానికి స్వీట్ల‌ను లొట్ట‌లేసుకుంటూ తినే వాళ్లే ఎక్కువ. అయితే.. ఇంట్లో చేసుకున్న స్వీట్ల‌యితే ఓకే.. కాని, స్వీట్ షాపులో స్వీట్లు కొంటే మాత్రం ఇకమీదట కాస్త జాగ్ర‌త్త వ‌హించాల్సిందే.

ఎందుకంటే.. అమెరికాలోని ఇల్లినాయిస్ కు చెందిన‌ రాచెల్ విల్లే.. ఫెర్రారో రోచర్ చాక్లెట్ లడ్డూలు కొనుక్కుని వాటిని రూమ్ కు తీసుకెళ్లి ఓపెన్ చేసి స‌గం తిన్నాక లడ్డూలోంచి తెల్ల‌టి పురుగులు బ‌య‌టికి రావడం చూసి కెవ్వు మంది.

maggots-ferrero-rocher

తింటున్న చాక్లెట్ లడ్డూలోంచి పురుగులు రావడంతో తీవ్రంగా భ‌య‌ప‌డిన రాచెల్.. అనుమానం వచ్చి మరికొన్ని చాక్లెట్ లడ్డూలను ఓపెన్ చేసి చూడ‌గా.. వాటిలోంచి కూడా లొకలొకలాడుతూ బ‌య‌టికి వ‌స్తున్న పురుగుల‌ను గ‌మ‌నించింది.

ఎక్స్ పైరీ డేట్ చూస్తే.. మార్చి 6, 2018 వ‌ర‌కు ఉంద‌ట‌. ఎంతో న‌మ్మ‌క‌మైన షాపు అనుకొని ఇన్నిరోజులు అక్క‌డ తను స్వీట్స్ కొన్న‌ద‌ట. కానీ.. ఇలా పురుగులు రావ‌డం మాత్రం ఇదే ఫ‌స్ట్ టైమ్ అట‌. వెంట‌నే స్వీట్ కంపెనీ కి ఫోన్ చేసి అస‌లు విష‌యం చెప్పింద‌ట‌.

ఇక‌.. ఆ పురుగులు ఉన్న చాక్లెట్ లడ్డూను ఫోటోలు తీసి.. తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసింది రాచెల్. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. మరి జాగ్రత్త.. ఏది కొన్నా కాస్త చూసుకుని తినడం మంచిది.. బయటి తిండి కదా!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A US woman has shared photos and videos of live maggots crawling all over Ferraro Rocher chocolates on Facebook giving the creeps to everyone who saw them. Rachael Vile from Illinois said every piece of the chocolates inside the box of Ferraro Rocher had maggots on them. It was only after she had eaten half of the chocolates her roommate told her that she had found the creepy crawlies on them. In the video, Vile can be seen unwrapping the golden wrapper of the chocolates one after another only to find maggots crawling on all of them. She said the chocolates were supposed to expire on March 6, 2018.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి