వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలు పిల్లల్ని కనేందుకే-మంత్రులు కావాల్సిన అవసరం లేదు-తాలిబన్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

మహిళలంటే తాలిబన్లకు ఎంత చిన్న చూపనేది ఇదివరకు ఎన్నో ఘటనల్లో వెల్లడైంది. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో అత్యంత హింసకు గురైనది మహిళలే. ఆ చీకటి రోజులు మళ్లీ రావడంతో మహిళలు మళ్లీ హక్కుల కోసం నినదించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈసారి తాలిబన్ల ప్రకటనలు కొంత ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగానే ఉన్నాయి. తాలిబన్ పాలనలో మహిళల అణచివేతే తప్ప హక్కులు,సాధికారతకు తావు లేదనేది ప్రస్తుత పరిణామాలు కళ్లకు కడుతున్నాయి. తాజాగా తాలిబన్ ప్రతినిధి ఒకరు మహిళలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాలిబన్ సంచలన వ్యాఖ్యలు..

తాలిబన్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లాహ్ హషిమి మాట్లాడుతూ... మహిళలు పిల్లలను కనేందుకే పరిమితం కావాలన్నారు. మహిళలను మంత్రులు చేయడమంటే వారి మెడకు మోయలేని భారాన్ని తగిలించడమేనని పేర్కొన్నారు. అయినా మహిళలు మంత్రులు కావాల్సిన అవసరం లేదని... వారు పిల్లల్ని కనేందుకే అని అభిప్రాయపడ్డారు. కాబూల్ వీధుల్లో నిరసన తెలియజేస్తున్న మహిళలు... మొత్తం ఆఫ్గన్ మహిళా సమాజానికి ప్రతినిధులు కాదన్నారు.

ఒక్క మహిళకూ ప్రాతినిధ్యం లేదు...

ఒక్క మహిళకూ ప్రాతినిధ్యం లేదు...

33 మంది మంత్రులతో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉగ్రవాద నేపథ్యం ఉన్న తాలిబన్లు,హక్కానీ నెట్‌వర్క్‌కి చెందిన నేతలకు తప్ప ఇంకెవరికీ స్థానం కల్పించలేదు. అన్ని వర్గాలు,గ్రూపులకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉంటుందని ప్రకటించిన తాలిబన్లు ఆ మాట నిలుపుకోలేదు. ముఖ్యంగా ఒక్క మహిళను కూడా ప్రభుత్వంలోకి తీసుకోకపోవడంపై మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ధోరణిని నిరసిస్తూ పదుల సంఖ్యలో ఆఫ్గన్ మహిళలు కాబూల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. నిజానికి తాలిబన్ల పాలనలో మహిళలు రోడ్డెక్కడమంటే సాహసమనే చెప్పాలి. కానీ హక్కులు లేని జీవితం కంటే ప్రాణాలకు తెగించి తాలిబన్లపై తిరగబడటమే సరైందని అక్కడి మహిళలు భావిస్తున్నారు. అయితే తాలిబన్లు మాత్రం మహిళల ప్రాతినిధ్యాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించట్లేదు.

మళ్లీ ఆ ఆకృత్యాలు...

మళ్లీ ఆ ఆకృత్యాలు...

మహిళలకు షరియా చట్టాలకు లోబడే హక్కులు ఉంటాయని తాలిబన్లు మొదట్లోనే ప్రకటించారు. ఆ చట్టాల ప్రకారం స్త్రీలకు విద్య,ఉద్యోగం నిషేధం. అయితే ఆ రెండింటికీ వెసులుబాటు కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల హస్తగతం కాగానే ఉద్యోగస్తులైన మహిళలందరినీ కార్యాలయాల నుంచి వెళ్లగొట్టారు. మళ్లీ ఆఫీసులకు వెళ్లవద్దని... వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 1996-2002 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు విద్య,ఉద్యోగం నిషేధించారు. ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లను మూసివేయించారు.స్త్రీలు గడప దాటాలంటే మగ తోడు తప్పనిసరి చేశారు. అది కూడా కుటుంబ సభ్యుడే అయి ఉండాలి. మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తిస్తే వారికి బహిరంగ మరణ శిక్షలు వేసేవారు. రాళ్లతో కొట్టి చంపడం,బహిరంగ శిరచ్చేదనం,హత్యకు ముందు గ్యాంగ్ రేప్ వంటి ఆకృత్యాలకు పాల్పడేవారు.

Recommended Video

Cricket Australia Warns Talibans.. మ‌హిళ‌ల‌ను ఆడనిస్తేనే మీతో సిరీస్ || Oneindia Telugu
మహిళా భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన

మహిళా భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన

ఇంటింటికీ తిరుగుతూ 15 ఏళ్లు పైబడిన బాలికలను తమ వెంట తీసుకెళ్లేవారు. తమతో వచ్చేందుకు నిరాకరిస్తే నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవారు. వారిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం లేదా సెక్స్ బానిసలుగా మార్చడం చేసేవారు. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించిన నేపథ్యంలో ఆనాటి ఆకృత్యాలన్నీ మళ్లీ రిపీట్ అవుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఆఫ్గనిస్తాన్ మహిళల హక్కులు,భద్రత పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

English summary
Taliban spokesman Syed Zakrullah Hashimi recently said that women should be restricted from having children. He said that making women ministers was like putting an unbearable burden on their necks. However, women do not need to be ministers ... they want to have children
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X