ప్రాణాంతక నగరాల జాబితా: శ్రీనగర్, ఇంఫాల్‌కు చోటు, టాప్‌లో బాగ్దాద్

లండన్: ప్రపంచంలో ప్రాణాంతక నగరాల జాబితాలో భారతదేశంలోని శ్రీనగర్, ఇంఫాల్న గరాలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు వివరాలను గురువారం గ్లోబల్ రిస్క్ విశ్లేషణ కంపెనీ వెరిస్క్ మాప్లెక్రాఫ్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ప్రమాదకరమైన నగరం బాగ్దాద్ అగ్రస్థానంలో నిలిచింది.

యూరోప్‌లోనే బెల్ఫాస్ట్ అత్యంత ప్రమాదకర నగరంగా పేరు పొందింది. బాగ్దాద్‌లో ఇప్పటి వరకు జరిగిన 380 దాడుల్లో 1141 మంది ప్రజలు మరణించగా, 3,600మంది ప్రజలు గాయాలపాలయ్యారు. విశ్లేషణ కంపెనీ 1,300 వాణిజ్య కేంద్రాలు, నగరాలను పరిగణలోకి తీసుకుంది. 7/7 బాంబు దాడి తర్వాత ఎలాంటి ఉగ్రవాదదాడులు జరగని కారణంగా లండన్‌కు 400వ ర్యాంకు లభించింది.

జనవరిలో చార్లీ హెబ్డోపై ఉగ్రవాద దాడితో ప్యారీస్ నగరం జాబితాలో టాప్ 100లో నిలిచింది. మార్చి 2015 నుంచి 12 నెలల కాలానికి ఉగ్రవాదదాడులు ప్రమాణంగా తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఐదేళ్లలో జరిగిన దాడులను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పింది.

terrorist

ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 17మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అత్యధిక ప్రమాదం గల నగరాల్లో కెన్యాలోని నైరోబి, నైజీరియాలోని లాగోస్ నగరాలున్నాయి. ఈ నగరాల్లో ఉగ్రవాదదాడులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

బాగ్దాద్, మోసూల్, రమాది, బకూబా, ఆల్ హిల్లా, ఇరాక్‌లోని కర్బాలా, కిర్కుక్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, కాంధర్, జలలాబాద్, పాకిస్థాన్‌లోని క్వెట్టా, పెషావర్, హస్సుఖేల్, కరాచీ, సోమాలియాలోని మోగదిషు, లిబియాలోని బెంగాజి నగరాలు ప్రపంచంలో అత్యంత ప్రమాదకర నగరాల జాబితాలో టాప్-16లో ఉన్నాయి.

నైజీరియాలోని జోస్, అబుజా, కానో, మెయన్‌లోని సానా, పాకిస్థాన్‌లోని లాహోర్, రావల్పిండి, ఇతర నగరాలు ప్రపంచ ప్రమాదకర నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+