వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ఐవీని నియంత్రించడంలో ఈ జంతువులు సహాయం చేస్తాయట..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ప్రపంచంలో అత్యంత పాత తెగకు చెందిన రీసస్ మకాక్యూ అనే కోతుల నుంచి తీసుకున్నయాంటీబాడీస్ ద్వారా హెచ్‌ఐవీ వైరస్ వ్యాధిని నయం చేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. హెచ్‌ఐవీ సోకిన వారిలో రోగనిరోధక వ్యవస్థ క్రమంగా దెబ్బతింటూ వస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలు... వాటిని తటస్థపరిచేందుకు ప్రతిరోధకాలుగా కోతుల నుంచి తీసుకున్న యాంటీ బాడీస్ పనిచేస్తాయని చెబుతున్నారు. దీన్ని ధృవీకరించేందుకు శాస్త్రవేత్తలు ముందుగా జంతువులపై పరిశోధనలు చేస్తున్నారు. ల్యాబ్‌లో తయారుచేసిన హెచ్‌ఐవీ వైరస్‌ను ముందుగా జంతువుల్లోకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి ఆ తర్వాత కోతి నుంచి తీసిన యాంటీబాడీస్‌ను జంతువుల శరీరంలోకి ఎక్కించారు.

జంతువుల్లోకి తటస్థీకరణ ప్రతిరోధకాలు ప్రవేశపెట్టాక పరిశీలిస్తే ఈ యాంటీబాడీస్‌ హెచ్ఐవీ సోకిన జంతువును వైరస్‌నుంచి రక్షిస్తున్నట్లుగా తమ పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు డెన్నీస్ బూర్టన్ అనే పరిశోధకుడు. దీనికి సంబంధించిన ప్రయోగాలు జర్నల్ ఆఫ్ ఇమ్యూనిటీలో ప్రచురించడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ ఇంకా మనిషిపై ప్రయోగం చేయలేదని చెప్పారు. కానీ హెచ్ఐవీ సోకిన వారిలో ఈ కోతుల నుంచి తీసిన యాంటిబాడీస్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వ్యాధిని నిరోధించే అవకాశం ఉందని చెప్పారు.

Worlds oldest monkeys may help fight against HIV

ఇక హెచ్‌ఐవీ సోకడం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కేవలం ఇది తగ్గకుండా మాత్రమే కోతుల నుంచి తీసిన యాంటీబాడీస్ పని చేస్తాయని పరిశోధకులు చెప్పారు. ఇతరత్ర కారణాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే వాటికి ఈ వ్యాక్సిన్ పనిచేయదని స్పష్టం చేశారు.

English summary
Turns out, world's oldest monkeys the Rhesus macaque could be prompted to produce neutralizing antibodies against one strain of HIV that resembles the resilient viral form that most commonly infects people.The study identified the rare, vulnerable areas on HIV and the immune system to make antibodies attack those areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X