వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: విడాకుల తర్వాత కూడా జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరుగుతుంది

|
Google Oneindia TeluguNews

అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన ఆస్తిలో సగభాగం భార్యకు భరణం కింద ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జెఫ్ బెజోస్ భార్య మెకెంజీకి ఆస్తిలో సగభాగం ఇస్తే ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళగా రికార్డు సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకుల ఇచ్చిన తర్వాత ఆయన ఆస్తిలో భాగం ఇచ్చాక కూడా అతని దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

 ప్రస్తుతం జెఫ్ బెజోస్ ఆస్తులు విలువ రూ.9,99,180 కోట్లు

ప్రస్తుతం జెఫ్ బెజోస్ ఆస్తులు విలువ రూ.9,99,180 కోట్లు

జెఫ్ బెజోస్... ప్రముఖ ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకులు. ఈ మధ్య జెఫ్ బెజోస్ పేరు ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఆయన భార్యకు విడాకులు ఇస్తుండటమే. జెఫ్ బెజోస్ భార్య మెకెంజీకి ఆయన త్వరలో విడాకులు ఇవ్వనున్నారు. విడాకులు ఇచ్చాక ఆమెకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జెఫ్ తన ఆస్తిలో సగం వాటా ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జెఫ్ బెజోస్ పేరిట ఆస్తులు 140 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.9,99,180 కోట్లు ఉన్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నిలిచిన బిల్ గేట్స్ ఆస్తుల కంటే జెఫ్ బెజోస్ ఆస్తులు రూ.3,20,760 కోట్లు అధికం అని తేలింది.

 మిగిలిన ఆస్తుల్లో ఒక్క శాతం ఆస్తి ఇథియోపియా దేశ ఆరోగ్య బడ్జెట్

మిగిలిన ఆస్తుల్లో ఒక్క శాతం ఆస్తి ఇథియోపియా దేశ ఆరోగ్య బడ్జెట్

విడాకులు ఇచ్చాక కూడా జెఫ్ బెజోస్ దగ్గర ఆస్తి ఎంత ఉంటుందో తెలిస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. విడాకుల తర్వాత బెజోస్ దగ్గర మిగిలి ఉండే ఆస్తిలో ఒక్క శాతంతో ఇథియోపియా దేశం ఆరోగ్య బడ్జెట్ తయారు అవుతుందని ఆక్స్‌ఫామ్‌ స్టడీ వెల్లడిస్తోంది. అంతేకాదు పేదరికంలో ఉన్న 49 దేశాల స్థూలదేశీయ ఉత్పత్తి (జీడీపీ)కంటే ఎక్కువగా ఉంది. ఒక వేళ బెజోస్ అనే వ్యక్తి దేశం అయ్యి ఉంటే కనుక మొత్తం188 దేశాల్లో అత్యధిక ధనిక దేశాల్లో బెజోస్ అనే దేశం 57వ స్థానంలో నిలిచేది. కొన్ని దేశాల్లో ఉన్న ఆస్తుల కంటే బెజోస్ ఆస్తి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఐస్‌లాండ్, తునీషియా, జమైకా, ఎస్టోనియా దేశాల దగ్గర ఉన్న డబ్బులకంటే బెజోస్ దగ్గర ఉన్న డబ్బులే ఎక్కువగా ఉన్నాయి.

2018 తొలి అర్థభాగంలో సరాసరి రూ.1200 కోట్లు

2018 తొలి అర్థభాగంలో సరాసరి రూ.1200 కోట్లు

ప్రపంచంలో ఉన్న 500 ధనికుల ఆస్తుల కంటే 2.8శాతం ఆస్తులు బెజోస్‌కు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెజోస్ దగ్గర ఎంత ఆస్తి ఉందంటే ఆయన తలుచుకుంటే 10.9 కోట్ల ఔన్సుల బంగారాన్ని కొనేసేయొచ్చు. లేదా 2.23 కోట్ల బారెళ్ల ముడిచమురు కొనేంత ఆస్తి ఉంది. ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టాక జెఫ్ బెజోస్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ఒక్క 2018లో తొలి ఆరునెలల్లో బెజోస్ సరాసరి 1200 కోట్లు సంపాదించినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్ సూచిక వెల్లడించింది.

English summary
The world’s richest man Jeff Bezos may lose almost half of his wealth after his divorce but would still have enough to fund the entire health budget of Ethiopia and many more countries.A recent Oxfam study noted that just 1 per cent of Bezos's wealth is equal to the entire health budget of African nation Ethiopia. The 54-year-old Amazon founder has seen a meteoric rise in wealth after a major slump in December last year.As of now, Jeff Bezos has a total net worth of $140 billion or Rs 9,99,180 crore, according to Bloomberg Billionaire Index.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X