ముఖం చాటేసిన చైనా అధినేత జిన్‌పింగ్..భారత పర్యటనకు డుమ్మా

వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సన్నాహాక సమావేశాలు విశాఖపట్నంతో పాటు బెంగళూరు, ముంబై, జైపూర్‌.. వంటి నగరాల్లో సన్నాహాక సదస్సులు ముగిశాయి.

జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

Xi Jinping

ఈ ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సులో పాల్గొనడానికి జో బైడెన్.. భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటన ఖరారైనట్లు ఇదివరకే వైట్ హౌస్ వెల్లడించింది. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు బైడెన్ భారత్‌లో పర్యటిస్తారు. 7వ తేదీన ఆయన భారత్‌కు చేరుకుంటారు. ఆయన వెంట అమెరికా విదేశాంగ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు.

జీ20లో సభ్య దేశంగా కొనసాగుతున్న చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్.. భారత పర్యటనపై అనుమానాలు ఏర్పడ్డాయి. జీ20 సమ్మిట్‌లో పాల్గొనడానికి ఆయన రాకపోవచ్చని తెలుస్తోంది. చైనా తరఫున ఆ దేశ మంత్రి లి కియాంగ్ హాజరవుతారని సమాచారం. ఆయన ఎందుకు జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.

చైనాలోని భారత రాయబార కార్యాలయం, చైనాలో జీ20 కార్యకలాపానలను పర్యవేక్షిస్తోన్న భారత అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ భేటీకి హాజరు కావట్లేదు. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌కు వస్తారు.

అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తమదేశంలో విలీనం చేసుకున్నట్లు చైనా ఇటీవలే అధికారిక మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. లఢక్ సమీపంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద గల వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్‌ రీజియన్‌ను కూడా తమ దేశ భూభాగంగా చూపించింది. దీనిపై జీ20లో ప్రస్తావించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జిన్‌పింగ్ హాజరు కాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+