సర్వసైన్యాధ్యక్షుడిగా చైనా అధినేత జిన్‌పింగ్- మిలటరీ మొత్తం..!!
గ్ఝి జిన్ పింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితోపాటు సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ గానూ ఆయననే ఎన్నుకున్నారు.
బీజింగ్: గ్ఝి జిన్ పింగ్- చైనా అధినేతగా మరోసారి ఎన్నికయ్యారు. చైనా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం వరుసగా ఇది మూడోసారి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అగ్ర నాయకత్వం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీనితో పాటు- సర్వసైన్యాధ్యక్ష పదవినీ ఆయనకే అప్పగించింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ గా కూడా జిన్ పింగ్ వ్యవహరిస్తారు. చైనా ఉపాధ్యక్షుడిగా హ్యాన్ ఝెంగ్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా గ్ఝావో లెఝీ ఎన్నికయ్యారు.
ప్రస్తుతం చైనాలో 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వేదికగా అయిదు రోజులుగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్, హ్యాన్ ఝెంగ్, గ్ఝావో లెఝీ సహా పీపుల్స్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. 2,952 మంది సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. మూడోసారి జిన్ పింగ్ ను దేశాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారిస్తూ జీరో కోవిడ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చిన తరువాత జిన్‌పింగ్ వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఆయన దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అల్లర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులతో పాటు జర్నలిస్టులను సైతం వదలట్లేదు పోలీసులు. నిరసన ప్రదర్శనలను చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఫొటో జర్నలిస్టులు, విలేకరులను అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ ఆందోళనల తరువాత జిన్ పింగ్ నాయకత్వంపై చైనా కమ్యూనిస్టు పార్టీలో వ్యతిరేకత ఎదురు కావొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై మీడియాలోనూ పలు కథనాలు వెలువడ్డాయి. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేదు. అసలు పోటీ అనేదే లేకుండా జిన్ పింగ్..మరోసారి చైనా అధినేతగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలను కూడా జిన్ పింగ్ కే అప్పగించారు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ పితామహుడు మావో ఝెడాంగ్ తరువాత సుదీర్ఘకాలం ఆ దేశాధ్యక్షుడిగా పని చేసిన నాయకుడిగా ఆవిర్భవించారు జిన్ పింగ్. సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకే బడ్జెట్ లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి భారీగానిధులను కేటాయించారాయన. తన సైనిక బలాన్ని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక పూర్తిస్థాయి మిలటరీ కమిషన్ బాధ్యతలను ఆయనే స్వీకరించడం ఆసక్తి రేపుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications