వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1600 మంది ఉద్యోగులకు ‘యాహు’ ఉద్వాసన..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజ కంపెనీ యాహూ త్వరలో పదహారు వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక కథనం ప్రచురితమైంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం యాహు నాల్గవ త్రైమాసిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.

ఫలితాల అనంతరం ఉద్యోగుల తొలగింపు ఉంటుందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారని అందులో పేర్కొంది. సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో 15 శాతం అంటే సుమారు 1600 మందికి పైగా తొలగించే దిశగా అడుగులు వేస్తోంది.

Yahoo expected to unveil layoffs, other cost cuts during earnings call

మేనేజ్‌మెంట్ మార్పుల్లో భాగంగా యాహు డైరెక్టర్లపై ఒత్తడి పెరిగిందని, లాభాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సంస్ధ నిర్వహణ ఖర్చును నియంత్రించేందుకే ఉద్యోగులను తొలగించనున్నట్లు కథనంలో పేర్కొంది. అర్జెంటీనా, మెక్సికోలో ఉన్న తన కార్యాలయాలను మూసివేయనున్నట్లు యాహూ గత వారమే ప్రకటించింది.

అయితే ఎంతమంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల కాలంలో ఈ కామర్స్‌ను విస్తృతం చేయడంతో యాహు సంస్ధ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటితో పాటు సెర్చ్, వార్తలు, క్రీడలు మొదలైన విభాగాల్లో ఫేస్‌బుక్, గూగుల్ ఆల్ఫాబెట్ నుంచి యాహు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు. తాజా ఉద్యోగుల తొలగింపుపై యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.

English summary
Yahoo, under pressure to do something dramatic to turn itself around, is expected to announce along with its fourth-quarter results Tuesday a cost-cutting proposal that involves closing down units and layoffs of up to 15 percent of its workforce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X