వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు నెలలు గ్యాంగ్ రేప్: వందల మందికి బలి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యాజిదీ యువతులపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్) సామూహిక అత్యాచారాలు చేస్తున్నారని ప్రత్యక్ష బాధితురాలు ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచానికి వివరించారు.

తన కన్యత్వంతో పాటు జీవితాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నాశనం చేశారని ఇరాక్ కు చెందిన నాదియా మురాద్ బాసీ తహా (21) అనే యువతి ఆవేదన చెందింది. 15 దేశాల సభ్యత్వం గల ఐక్యరాజ్య సమితిలో నదియా ఈ విషయాలు స్వయంగా వెల్లడించడంతో ఆ దేశాల ప్రతినిధులు చలించిపోయారు.

నదియా వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాక్ లోని ఓ గ్రామంలో యాజిదీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు చేత పట్టుకుని ఆ గ్రామం మీదపడ్డారు.

తరువాత చిన్నాపెద్దా అని తేడా లేకుండా 150 మంది యువతులను బస్సులలో కిడ్నాప్ చేశారు. బస్సుల్లోనే వారిని లైంగిక వేదిపులకు గురి చేశారు. ఐఎస్ఐఎస్ ప్రాభల్యం ఎక్కువుగా ఉన్న మోసూల్ నగరంలోని ఓ పెద్ద భవంతిలోకి తీసుకు వెళ్లారు.

తరువాత అందరిని వరుసగా నిలబెట్టారు. అనంతరం ఉగ్రవాదులు ఒక్కోక్కరు వారికి కావలసిన అమ్మాయిలను ఎన్నుకునే పద్ధతి అనుసరించారు. నదియా ముందు ఓ భారీ ఆకారం నిలబడింది. అతనిని చూసిన వెంటనే నదియా హడలిపోయింది.

తరువాత అతను నదియాను పట్టుకుని చితకబాది వెళ్లిపోయాడు. తరువాత మరో వ్యక్తి వచ్చి నదియాను ఎన్నుకుని ఓ గదిలోకి తీసుకు వెళ్లాడు. అక్కడ పలువురు ఉగ్రవాదులు నదియా మీద గ్యాంగ్ రేప్ చేశారు.

Yazidi women held as sex slave for three months by Islamic State (ISIS)

ఆరోజు తాను సృహ తప్పిపోయే వరకు తన మీద గ్యాంగ్ రేప్ చేశారని నదియా ఐక్యరాజ్య సమితిలో బోరున విలపించింది. అప్పటి నుంచి తన మీద మూడు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారని నదియా ఆవేదన చెందింది.

మూడు నెలల పాటు ప్రత్యక్ష నరకం చూసిన తాను తప్పించుకున్నానని, స్వచ్చంద సంస్థల సహకారంతో జర్మనీ చేరుకున్నానని నదియా వివరించింది. ప్రస్తుతం నదియా జర్మనీలో తలదాచుకునింది. నదియా ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, వారిని సమూలంగా నిర్మూలించాలని వేడుకునింది. నదియా మాటలకు చలించి పోయిన ఐక్యరాజ్య సమితి ప్రనిధులు యుద్ద నేరాల కింద ఐఎస్ఐఎస్ ను కఠినంగా శిక్షించాలని నిర్ణయించారు.

English summary
A young Yazidi woman who was tortured and treated as a sex slave for three months by Islamic State (ISIS) fighters has bravely revealed her horrific ordeal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X