ఓఫ్రో విన్‌ఫ్రే పోటీ చేయదు, ఆమెతో పోటీ అంటేనే ఫన్నీ: డొనాల్డ్ ట్రంప్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ ఓఫ్రా విన్ ఫ్రే పోటీ చేయలేరని, పోటీ చేసినా ఓడిస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఓఫ్రా మాట్లాడారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశముందని పరోక్షంగా వెల్లడించారు. దీనిపై ట్రంప్ మాట్లాడారు. తాను ఓఫ్రాను ఓడిస్తానని, ఆమె తనకు బాగా తెలుసునని, ఓఫ్రా అంటే గౌరవం ఉందని, ఆమె 2020 ఎన్నికల్లో పోటీ చేయదని అభిప్రాయపడ్డారు.

'Yeah, I'll beat Oprah': Donald Trump says he'd defeat Winfrey in presidential race

అయినా ఓఫ్రా లాంటి వ్యక్తితో అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటం చాలా ఫన్నీంగా ఉంటుందని ట్రంప్ అన్నారు. ఓఫ్రా నిర్వహించే కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నానని చెప్పారు. 1999లో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలంటే తనకు పోటీగా ఓఫ్రానే ఎంచుకుంటానని చెప్పారట.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump said Tuesday he would beat Oprah Winfrey in any prospective 2020 presidential faceoff — and that such a race would "be a lot of fun."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి