వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసీదులో ఆత్మాహుతి దాడి: 29 మంది మృతి

|
Google Oneindia TeluguNews

సనా: యెమన్ రాజధాని సనాలోని ఓ మసీదులో గురువారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రగాయాలైనట్టు అధికారులు తెలిపారు.

మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని తెలిపారు.

Yemen suicide bombing in Sanaa mosque 'kills 29'

యెమన్ అధ్యక్షుడు అబ్ ద్రుబ్ మన్‌సూర్ సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ మిలిటెంట్ల హిట్ లిస్ట్ లో ఉండటంతో మన్ సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు.

కాగా, యెమన్‌లో గత మార్చి నుంచి కొనసాగుతున్న యుద్ధం కారణంగా సుమారు 4,900 మంది మరణించారని, అందులో 2,200మంది సాధారణ పౌరులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది.

English summary
A suicide bomb attack on a mosque in Yemen's capital, Sanaa, has killed at least 29 people, sources say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X