బంతి తాకి ప్రాణాలు విడిచిన పాకిస్తాన్ క్రికెటర్

వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆ సంఘటన మంగళవారంనాడు జరిగింది. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము జిన్నా మున్సిపల్ స్టేడియంలో సింధ్ యంగ్ క్రికెట్ క్లబ్‌పై మ్యాచు ఆడుతున్నామని, ఆ సమయంలో సుక్కుర్‌లో టాప్ ప్లేయర్ అయిన భట్టి బ్యాటింగ్ చేస్తుండగా అతని ఛాతీపై బంతి తగిలిందని కబ్ల్ అధికారి రెహ్మత్ తెలిపారు.
బంతి తగలగానే భట్టి కుప్పకూలిపోయాడని, వెంటనే ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు చెప్పారని ఆయన వివరించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి, జాతీయ జట్టులోకి ప్రవేశించాలని భట్టీ కలలు కన్నాడని, అతనికి క్రికెటే జీవితమని రెహ్మత్ అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన షర్జీల్ ఖాన్‌కు అవకాశం లభించిన తర్వాత సింధూలోని మారుమూల ప్రాంతాలకు, చిన్నపాటి పట్టణాలకు చెందిన క్రికెటర్లకు కూడా జాతీయ జట్టులో స్థానం లభిస్తుందనే నమ్మకం ఏర్పడిందని భట్టీ అంతకు ముందు రోజే అన్నాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications