• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇలాంటి బట్టలు విమాన ప్రయాణంలో వేసుకోకూడదా...దింపేస్తారా..?

|

సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో మహిళల వస్త్రధారణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంట్లోనే కాదు బయటకూడా కురుచ దుస్తులు ధరిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా కామన్. ఓ 21ఏళ్ల యువతి వస్త్రధారణ ఇబ్బందికరంగా ఉందంటూ ఓ విమానాయాన సంస్థ సిబ్బంది ఆమెను విమానం నుంచి బయటకు దిగాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది.

బయటపడ్డ డ్రాగన్ బుద్ధి: మసూద్‌ అజార్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనా

ఇక అసలు విషయానికొస్తే... ఎమిలీ ఓ కానర్ అనే 21 ఏళ్ల మహిళ యూకేలోని బ్రిమ్మింగ్హమ్ విమానాశ్రయం నుంచి టెనిరైఫ్‌కు వెళ్లేందుకు థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసుకుంది. ఇక విమానం ఎక్కేందుకు విమానాశ్రయంకు చేరుకుంది. అయితే తను వేసుకున్న దుస్తులు చాలా ఇబ్బందిగా ఉన్నాయంటూ క్యాబిన్ సిబ్బంది తనతో చెప్పినట్లుగా ఎమిలీ వెల్లడించింది. ఆ సమయంలో క్రాప్ టాప్, హైవేయిస్టెడ్ ప్యాంట్‌ను ఆమె ధరించారు. విమానాశ్రయంలో మొత్తం అదే దుస్తులతో తిరిగిందని చెప్పిన ఎమిలి... విమానంలోకి ప్రవేశించగానే ఒక జాకెట్ ధరించాల్సిందిగా క్యాబిన్ సిబ్బంది కోరిందని ఎమిలీ చెప్పింది. ఫ్లైట్ మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా జాకెట్ ధరించాలని లేదంటే విమానం నుంచి దింపివేస్తామని బెదిరించినట్లు ఎమిలీ తెలిపింది.

‘Your clothing causing offence’: UK airlines threatens to offload woman

ఈ విషయం బయటకు పొక్కడంతో థామస్ కుక్ విమానాయాన సంస్థ యాజమాన్యం ఎమిలీకి క్షమాపణ చెప్పింది. ఆమెతో క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నారు. అయితే ఎమిలీ అలాంటి దుస్తులు ధరించినందుకు తాము మరోలా ఆమెకు నచ్చజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు విమానాయాన సంస్థ అధికారులు. చాలా విమానాయాన సంస్థల్లో ఉన్నట్లే మంచి దుస్తులు వేసుకోవాలనే పాలసీ తాము కూడా ఫాలో అవుతున్నట్లు థామస్ కుక్ విమానాయాన సంస్థ వెల్లడించింది. ఈ నిబంధన పురుషులకు మహిళలకు వర్తిస్తుందన్నారు. ఇందులో భాగంగానే తమ సిబ్బంది ఈ నిబంధనను అమలు చేసు క్రమంలో కాస్త కఠినంగా వ్యవహరించి ఉంటారని చెప్పుకొచ్చింది.

‘Your clothing causing offence’: UK airlines threatens to offload woman

ఇదిలా ఉంటే కొన్ని విమానాయాన సంస్థలు ప్రయాణికుల వస్త్రదారణపై ప్రత్యేక దృష్టి సారించి ఇందుకోసం కొన్ని విధానాలను రూపొందించాయి. ప్రయాణికులు వేసుకునే దుస్తులపై పిచ్చి రాతలు కానీ, ఫ్యాషన్ పేరుతో శరీరమంతా కనిపించేలా కురుచు దుస్తులు ధరిస్తే వాటిని వెంటనే మార్చుకుని విమానంలో ప్రయాణించాలనే నిబంధనలు తీసుకొచ్చాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
A UK airline has apologised to a 21-year-old woman for threatening to offload her from a flight for wearing “inappropriate” attire, the media reported.Emily O’Connor, who was travelling on a Thomas Cook Airlines flight from the UK’s Birmingham Airport to Tenerife in the Canary Islands on March 2, said the cabin crew told her that her clothing was “causing offence”, says a report.Her outfit consisted of a crop top and high-waisted pants.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more