Youtube: కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్.. ఇక నుంచి ఆ ఆప్షన్ ఉండదు..!
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను త్వరలో ఆపేయనుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను నిలిపివేయనుంది. యూట్యూబ్ 2017లో స్టోరీస్ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
"6/26/2023 నుంచి కొత్త YouTube స్టోరీని సృష్టించే ఎంపిక అందుబాటులో ఉండదు. ఆ తేదీలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేయబడిన కథనాలు పోస్ట్ చేసిన ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయి" అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ స్టోరీస్ ఫీచర్ ను సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ప్రవేశపెట్టారు. కానీ ఈ ఫీచర్ సక్సెస్ కాలేదు. ప్రవేశపెట్టిన మొదట్లో ఆదరణ భాగానే లభించినా క్రమంగా యూజర్లు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది.

2021లో ట్విట్టర్ ఫ్లీట్స్ వంటి ఫీచర్ ను అందుబాటులోకి తెవడంతో వినియోగదారులు అందరు అటువైపు మళ్లారు. దీంతో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ ఫీచర్ ను నిలిపివేశాయి. తాజాగా యూట్యూబ్ కూడా స్టోరీస్ ఫీచర్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది.
స్టోరీస్ ఫీచర్ 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వారికి అందుబాటులో ఉండేది. వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా కొత్త ఫీచర్‌లతో షార్ట్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లను మెరుగుపరచడం కొనసాగిస్తామని యూట్యూబ్ ఓ ప్రకటనలో తెలిపింది.
YouTube కమ్యూనిటీ సృష్టికర్తలను అప్‌డేట్‌లను షేర్ చేయడానికి, సంభాషణలను ప్రారంభించడానికి లేదా వారి ప్రేక్షకులకు వారి YouTube కంటెంట్‌ను ప్రచారం చేయడానికి వీలు కల్పిస్తుంది. "పోస్ట్‌లు, కథనాలు రెండింటినీ ఉపయోగించే క్రియేటర్‌లలో, కథనాలతో పోలిస్తే సగటున పోస్ట్‌లు అనేక రెట్లు ఎక్కువ కామెంట్లు, లైక్‌లను పెంచుతాయి" అని కంపెనీ పేర్కొంది. సంక్షిప్త వీడియో ఫార్మాట్ అయిన Shortsతో "కొత్త ప్రేక్షకులను చేరుకోవాలని" YouTube సృష్టికర్తలను కూడా కోరింది. స్టోరీల కంటే షార్ట్‌లు సగటున చాలా రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను పెంచుతాయని కంపెనీ విశ్వసిస్తోంది.












Click it and Unblock the Notifications