యూరప్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ధ్వంసం.. రష్యాపై విరుచుపడ్ద జెలెన్ స్కీ
రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలమౌతోంది. యుద్దంతో భారీగా నష్టపోయింది. రాజధాని కీవ్, ఖార్కిన్, మేరియుపోల్ సహా ప్రధాన నగరాలపై బాంబులతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. దాదాపు నగరాలన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా విధ్వంసమైన భవనాలు, రోడ్లు , ఆస్పత్రులు, పాఠశాలు దర్శనమిస్తున్నాయి. యుద్ధం సంక్షోభంతో ఉక్రెయిన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. లక్షలాది మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు.

ఖర్కివ్‌లో రష్యా సేనల దాడులు
ప్రధాన నగరాల్లో పట్టు సాధించేందుకు రష్యా తన దాడులను మరింత తీవ్రం చేసింది. తూర్పు ఉక్రెయిన్ లోని ఖర్కివ్ నగరంలో రష్యా దళాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో అయిదుగురు పౌరులు మృతి చెందారు. వీరిలో బాలుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా సైనిక చర్యలు ప్రారంభించిన నాటి నుంచే ఖర్కిన్ పై రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్నాయి.

బాంబులతో అతి పెద్ధ స్టీల్ ప్లాంట్ ధ్వంసం
తాజాగా యూరప్‌లో అతి పెద్ధ స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు బాంబులతో ధ్వంసం చేశాయి. ఇది ఉక్రెయిన్‌లోని అజోవ్‌స్తాల్‌లో ఈ ఐరన్ , స్టీల్ ప్లాంటు ఉంది. ఈ ప్లాంట్ విధ్వంసంతో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లినుందని ఆ దేశ ఎంపీ లీసియా వ్యాసిలెన్కో వెల్లడించారు. స్లీల్ ప్లాంట్ ధ్వంసంతో పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో అత్యంత ధనవంతుడు రినాట్ అఖ్మెటోవ్చే ఈ స్టీల్ ప్లాంట్ నడుపుతున్నారు.

ఆర్ట్‌స్కూల్ దాడులు.. మాయని మచ్చలా విధ్వంసం
ఉక్రెయిన్‌కు ప్రధాన ఓడవేవుగా నగరంగా ఉన్న మేరయుపోల్ పై రష్యా భీకరదాడులకు పాల్పడింది. యుద్ధం భయంతో ఆశ్రయం పొందుతోన్న ఓ ఆర్ట్ స్కూల్‌పై బాంబులతో దాడి చేసింది. దీంతో భవనం పూర్తిగా.. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని సిటీ కౌన్సిన్ తెలిపింది . దాడి సయమంలో 200 మంది ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది.
అటు మేరయుపోల్‌లో రష్యా జరిపిన దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. రష్యా సేనలు చేసిన యుద్ధ నేరాలు.. ప్రపంచ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతాయని మండిపడ్డారు. శాంతియుతంగా ఉండే నగరాలపై దాడులు.. రాబోయే శతబ్దాలకు గుర్తిండిపోయే విధ్వంసం అని జాతి నుద్దేశించిన జెలెన్ స్కీ ప్రసంగించారు.












Click it and Unblock the Notifications