'భారత్ సపోర్ట్ మాకే'.. ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్దం కొనసాగుతూనే ఉంది. మరోవైపు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును భారత్ కొనుగోలు చేస్తుందని తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను భారత్ పెంచుతోందని అన్నారు. అలా యుద్ధానికి భారత్ వనరులను అందిస్తోందంటూ భారత్ పై ట్రంప్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ సపోర్ట్ తమకే ఉందని స్పష్టం చేశారు. ట్రంప్ ఆరోపణల వేళ జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రష్యాతో మూడేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎక్కవగా ఉక్రెయిన్ వైపే నిలిచిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సపోర్ట్ రష్యా కంటే తమకే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు తాజాగా భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి రష్యాకు భారత్ వనరులను సమకూర్చుతోందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక వృద్ధికి భారత్ దోహదం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ త్వరలో తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఐరాస సమావేశానికి హాజరయ్యే క్రమంలో న్యూయార్క్ లో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో పాటుగా చైనా మద్దతు కూడా తమకే ఉందని తెలిపారు.
ఇక ఇటీవల ట్రంప్.. భారత్- రష్యా వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇన్నేళ్లపాటు సాగడానికి భారత్, చైనాలే పరోక్షంగా కారణం అని మండిపడ్డారు. ఇరు దేశాలతోపాటు నాటో దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు. ఆ కారణంతోనే యుద్ధాన్ని ఎలాగైనా నిలిపివేసేందుకు మరిన్ని సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. త్వరలోనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications