• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీమర్లే కాదు: ఆరోన్ ఫించ్ నోటి వెంట బండ బూతు: మైక్రో కెమెరాలో రికార్డ్: రస్సెల్ బౌలింగ్‌లో

|

షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2020 మ్యాచుల్లో ఇప్పటిదాకా బీమర్లను చూశాం. క్రీజ్‌లో పాతుకుపోయి, బంతులను ఫెన్సింగ్ దాటిస్తోన్న బ్యాట్స్‌మెన్లను భయపెట్టడానికి బౌలర్లు బీమర్లను సంధించిన సందర్భాలు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ నవదీప్ షైనీ ఇప్పటికే రెండు వేర్వేరు మ్యాచ్‌లల్లో బీమర్లను వదిలాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాపై రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏకంగా 152 కిలోమీటర్ల వేగంగా బీమర్‌ను సంధించాడు.

బీమర్లకు తోడుగా.. బూతులు కూడా

బీమర్లకు తోడుగా.. బూతులు కూడా

ఇప్పటిదాకా బీమర్లే పడుతున్నాయనుకుంటే.. వాటితో పాటు బూతులు కూడా వెలువడుతున్నాయి. బౌలర్లు బీమర్లు సంధిస్తోంటే.. బ్యాట్స్‌మెన్లు బూతులు తిట్టడానికి దిగుతున్నట్టు కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య షార్జాలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బూతులు వినిపించాయి. వికెట్లకు అమర్చిన మైక్రో కెమెరాల్లో అవి స్పష్టంగా రికార్డవుతున్నాయి. యధాతథంగా టెలికాస్ట్ అవుతున్నాయి. వాటిని కామెంటేటర్లు పసిగడుతున్నారు.

ఆరోన్ ఫించ్ నోటి వెంట..

షార్జాలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఆరోన్ ఫించ్ నోటి వెంట బండ బూతు ఒకటి వెలువడింది. కోల్‌కత నైట్ రైడర్స్ బౌలర్ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్‌లో ఆండ్రీ రస్సెల్ ఆరో ఓవర్‌ను వేశాడు. అప్పటికి బెంగళూరు జట్టు స్కోరు 43 పరుగులు. క్రీజ్‌లో ఆర్సీబీ ఓపెనర్లు ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్ ఉన్నారు. ఆండ్రీ రస్సెల్ వేసిన ఆ ఓవర్ మూడోబంతిని ఆరోన్ ఫించ్ ఎదుర్కొన్నాడు. భారీ షాట్ కొట్టబోయిన అతను బంతిని బీట్ అయ్యాడు. కనెక్ట్ చేయలేకపోయాడు. బీట్ అయిన వెంటనే ఆరోన్ ఫించ్ నోటి నుంచి అప్రయత్నంగా బూతు మాట వినిపించింది. "Oh, you bas*ard" అంటూ కామెంట్ చేశాడు. ఇది కాస్తా వికెట్లకు అమర్చిన మైక్రో కెమెరాలో స్పష్టంగా రికార్డయింది.

వరుసగా డాట్ బాల్స్ పడటంతో అసహనం..

వరుసగా డాట్ బాల్స్ పడటంతో అసహనం..

అప్పటికి ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అతణ్ని కట్టడి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసిన కోల్‌కత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించారు. ఫలితంగా- వరుసగా డాట్ బాల్స్‌ను ఎదుర్కొన్నాడు ఫించ్. భారీ షాట్‌కు ప్రయత్నించినప్పటికీ.. కనెక్ట్ కాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. ఆండ్రీ రస్సెల్ విసిరిన బంతిని బీట్ కాగానే.. ఆ అసహనం కాస్తా పీక్‌కు వెళ్లినట్టు కనిపించింది. అతని నోటి నుంచి "Oh, you bas*ard" అనే బూతు వినిపించింది. ఆ తరువాతి బంతిని కూడా షాట్ ఆడలేకపోయాడతను. ఈ బూతును విన్న వెంటనే కామెంటేటర్లు గట్టిగా నవ్వడం వినిపించింది.

మూడు పరుగులతో హాఫ్ సెంచరీ మిస్..

మూడు పరుగులతో హాఫ్ సెంచరీ మిస్..

ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్.. మూడు పరుగులతో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లో 47 పరుగులు చేశాడు. కోల్‌కత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏబీ డివిలియర్స్ ఇక ఏ రేంజ్‌లో చెలరేగిపోయాడనేది తెలుసు. పిడుగుల్లాంటి షాట్లు ఆడాడు. 33 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు, అయిదు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ను బెంగళూరు తన ఖాతాలో వేసుకుంది. 89 పరుగుల తేడాతో దినేష్ కార్తీక్ టీమ్‌ను ఓడించింది.

English summary
IPL 2020, Royal Challengers Bengaluru Opener Aaron Finch is Caught Abusing After Beaten By An Andre Russell's Delivery during the clash against Kolkata Knight Riders at Sharjah Stadium last night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X