వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ... యువ ఆటగాళ్లకు క్లాస్

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట హైదరాబాద్‌ బౌలర్లు సమష్ఠిగా సత్తాచాటడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 120 పరుగులే చేసింది. జోష్ ఫిలిప్‌ (32; 31 బంతుల్లో, 4×4) టాప్ స్కోరర్‌. అనంతరం ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వృద్ధిమాన్‌ సాహా (39; 32 బంతుల్లో, 4×4, 1×6), జాసన్‌ హోల్డర్‌ (26; 10 బంతుల్లో, 1×4, 3×6) సత్తాచాటారు. ఈ విజయంతో వార్నర్‌సేన నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఎస్‌ఆర్‌హెచ్‌ యువ ఆగాళ్లకు కింగ్ కోహ్లీ సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. మ్యాచ్‌కు ముందో, తర్వాతో తెలియదు కానీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ యువ ఆటగాళ్లు అయిన రషీద్ ఖాన్, ప్రియం గార్గ్, షాబాద్ నదీమ్, టీ నటరాజన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మలతో మాట్లాడాడు. ముఖ్యంగా నదీమ్, రషీద్‌లతో ఎక్కువ సమయం మాట్లాడినట్టు సమాచారం.

IPL 2020: Virat Kohli takes class to Sunrisers Hyderabad

విరాట్ కోహ్లీ కుర్చీలో కూర్చుని ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ యువ ఆటగాళ్లు చేతులు కట్టుకుని అతడు చెప్పే మాటలను శ్రద్దగా వింటున్నారు. రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్.. కోహ్లీ పక్కనే కూర్చుని అతనితో మాట్లాడారు. దీనికి సంబందించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 'కింగ్ విరాట్ కోహ్లీ' అని ఫొటోలకు కాప్షన్ పెట్టారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు అందరూ కలిసి కోహ్లీని ఓదారుస్తున్నారు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఎంఎస్ ధోనీ లాగే క్లాస్ తీసుకుంటున్నాడు' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ సందీప్‌ శర్మ శనివారం నాటి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయడం ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సందీప్‌ వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి కేన్ విలియమ్సన్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లీ పెవిలియన్‌ చేరాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీని అత్యధిక సార్లు (ఏడోసారి) ఔట్‌ చేసిన రికార్డును సందీప్‌ సాధించాడు. ఐపీఎల్‌లో కోహ్లీని ఆరుసార్లు ఔట్‌ చేసిన బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా. మిచెల్‌ మెక్లీన్‌గన్‌, మహ్మద్‌ షమీలు తలో మూడుసార్లు కోహ్లీని ఔట్‌ చేశారు.

IPL 2020 playoffs:'ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.. మేమింకా చేయాల్సింది చాలాఉంది'

English summary
IPL 2020, RCB vs SRH: RCB captain virat kohli gives suggestions to Sunrisers Hyderabad players like Abdul Samad, Rashid Khan, Shahbaz Nadeem. Royal Challengers Bangalore (RCB) skipper Virat Kohli criticised his players for not being brave enough with the bat, following defeat by a margin of five wickets against SunRisers Hyderabad (SRH). RCB were restricted to a paltry total of 120 runs for the loss of seven wickets in 20 overs, setting a target of just 121 runs for their opponents. The Hyderabad-based franchise chased it down in 14.1 overs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X