చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IPL auction: అన్ క్యాప్ ఆసీస్ క్రికెటర్‌పై కోట్లు గుమ్మరించిన ప్రీతిజింతా

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట హాట్‌గా సాగుతోంది. చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్.. వేదికగా సాగుతోన్న ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో కొందరు అన్ క్యాప్డ్ ఆటగాళ్లు రికార్డు స్థాయి రేట్లకు అమ్ముడుపోతోన్నారు. కర్ణాటకకు చెందిన కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. అతనిపై ఏకంగా 9.25 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. అదే రేంజ్‌లో పంజాబ్ కింగ్స్ కూడా ఓ అన్ క్యాప్డ్ క్రికెటర్‌పై భారీగా ఖర్చు పెట్టింది. అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడటం ఇదే తొలిసారిగా అంచనా వేస్తోన్నారు.

ఆ అన్ క్యాప్డ్ ఆటగాడి పేరు రిలే మెరెడిత్. ఆస్ట్రేలియన్ యంగ్ క్రికెటర్. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. ఐపీఎల్ మినీ ఆక్షన్ సందర్భంగా అతణ్ని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. వేలంపాటలో అతణ్ని ఎనిమిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఓ అన్ క్యాప్డ్ ఆటగాడు ఈ రేటుకు అమ్ముడుపోవడం అరుదు. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా- ప్రీతిజింతాకు చెందిన పంజాబ్ కింగ్స్ మెరెడిత్‌పై కోట్ల రూపాయలను గుమ్మరించింది.

IPL 2021 Auctions: Riley Meredith sold out to Punjab Kings for Rs 8 Crore

2017లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడిన ఆస్ట్రేలియా ఏ జట్టు తరఫున మెరెడిత్ తొలిసారిగా ఆడాడు. అదే ఏడాది నిర్వహించిన షెఫ్‌ఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్ మ్యాచుల్లో ఆడాడు. ప్రస్తుతం అతను టాస్మానియా క్రికెట్ టీమ్, హోబర్ట్ హరికేన్ జట్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ప్రధానంగా కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన మెరెడిత్‌కు అప్పుడప్పుడు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించే సత్తా ఉంది. టీ20 ఫార్మట్‌కు అతని ఆటతీరు సరిపోతుందనే ఉద్దేశంతో ప్రీతిజింతా టీమ్ అతణ్ని ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.

English summary
Riley Meredith is an Australian cricketer sold out to Punjab Kings for Rs 8 Crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X