వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

DC vs SRH: కేన్ మామ సత్తాకు అగ్నిపరీక్ష: ఢిల్లీతో ఢీ..!

|
Google Oneindia TeluguNews

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ సెకెండ్ ఫేస్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ బ్యాలెన్స్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్..మ్యాచ్‌కు అనూహ్య ఫలితాలు వస్తోన్నాయి. టోర్నమెంట్‌ను ఆసక్తికరంగా మార్చుతున్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన జట్లన్నీ పోటాపోటీగా ఫైట్ చేస్తోన్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిరాశ పర్చినప్పటికీ- వాటిపై ఉన్న అంచనాలు ఏ మాత్రం తగ్గట్లేదు.

Australia earthquake: వణికిన మెల్‌బోర్న్: భవనాలు ధ్వంసంAustralia earthquake: వణికిన మెల్‌బోర్న్: భవనాలు ధ్వంసం

సన్‌రైజర్స్ పరిస్థితేంటీ?

సన్‌రైజర్స్ పరిస్థితేంటీ?

ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పీడకలలా మారింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది కేన్ విలియమ్సన్ కేప్టెన్సీలోని సన్‌రైజర్స్ టీమ్. ఈ దఫా హైదరాబాదీ టీమ్ ప్లే ఆఫ్ చేరడం కూడా కష్టమే అనిపించేలా ఉంది దాని స్థితి. ఇప్పటిదాకా ఆడిన

ఏడు మ్యాచుల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలిచింది. ఆరు మ్యాచుల్లో పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ రేసులో నిల్చోవాలంటే ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ను కూడా గెలిచి తీరాల్సిన స్థితికి చేరింది సన్‌రైజర్స్. స్టార్ బ్యాట్స్‌మెన్ కమ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఆడకపోవడం మైనస్ పాయింట్.

 టేబుల్ టాపర్‌గా

టేబుల్ టాపర్‌గా

ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం బెటర్ పొజీషన్‌లో ఉంది. ఎనిమిది మ్యాచ్‌లల్లో ఆరింట్లో విజయాన్ని సాధించింది. 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. రెండోస్థాంనలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఇంకొక్క మ్యాచ్ ఆడితే చాలు. ఇదే దూకుడును కొనసాగించగలిగితే- ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టు ఇదే అవుతుంది. గత ఏడాది ఈ మెగా క్రికెట్ ఈవెంట్ రన్నరప్‌గా నిలిచింది ఢిల్లీ కేపిటల్స్. ఈ దఫా విన్నర్‌గా నిలవాలనే పట్టుదలను కనపరుస్తోంది.

 దూకుడు కొనసాగించేలా..

దూకుడు కొనసాగించేలా..

ఇప్పటిదాకా ఢిల్లీ కేపిటల్స్ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఆ లోటును భర్తీ చేసుకుని సగర్వంగా స్వదేశానికి చేరాలనే కసిని ప్రదర్శిస్తోందా టీమ్. రిషభ్ పంత్ జోరు మీద ఉండటం, శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడం కలిసొచ్చే అంశాలు. ఈ సారి టైటిల్ విన్నర్‌గా ఉండే పేర్లల్లో ప్రస్తుతానికి ఢిల్లీ కేపిటల్స్ పేరు బాగా వినిపిస్తోంది. లీగ్ దశలో చూపించిన దూకుడు, జోరును ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో కొనసాగించడంపై ఆ జట్టు జర్నీ ఆధారపడి ఉంటుంది. ప్లే ఆఫ్స్‌లో తడబడినా.. పొరపాట్లు చేసినా ఈ దఫా కూడా నిరాశ తప్పదు.

బలమైన టీమ్‌తో

బలమైన టీమ్‌తో

సెకెండ్ హాఫ్ మ్యాచుల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. తనకంటే ఎంతో బలమైన ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ అసలు సిసలు అగ్నిపరీక్షగా మారింది. ఇందులో ఓడితే- ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం అవుతాయి హైదరాబాద్‌కు. స్టార్ బ్యాట్స్‌మెన్, డాషింగ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో అందుబాటులో లేడు. అతను లేని లోటును భర్తీ చేయడం అసాధ్యమే. ఓపెనర్లు భారీ భాగస్వామ్యాన్ని అందించితే తప్ప మిడిలార్డర్‌పై ఒత్తిడి పోదు.

 ఓపెనర్లు వీరే..

ఓపెనర్లు వీరే..

డేవిడ్ వార్నర్‌, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే మీదే బ్యాటింగ్ భారం ఉంటుంది. బెయిర్‌‌స్టో అందుబాటులో లేకపోవడం వల్ల డేవిడ్ వార్నర్‌తో కలిసి వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఓపెనర్లు భారీ స్కోర్‌ను అందించగలిగితే తప్ప ఢిల్లీ కేపిటల్స్‌ను ఓడించడం అసాధ్యం. విజయ్ శంకర్ తన ఆల్‌రౌండర్ ప్రతాపాన్ని చూపాల్సి ఉంటుందీ మ్యాచ్‌లో. బౌలర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ రాణించగలిగితే ఢిల్లీని కంట్రోల్‌ చేయడానికి ఛాన్స్ ఉంది.

English summary
Delhi Capitals led by Wicket Keeper batsman Rishabh Pant, are all set to face the Sunrisers Hyderabad in Match No.33 of the 2021 IPL today at the Dubai International Cricket Stadium in UAE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X