చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్ సేన బ్యాటింగ్ లైనప్ వీక్: బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచుల్లో 5 వికెట్లు: స్కానింగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్,14వ ఎడిషన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన అయిదో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ సత్తాను చాటింది. కేప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలకు కేరాఫ్‌గా మారింది. లో స్కోర్ మ్యాచ్‌ను కాపాడుకోగలమనే విషయాన్ని రోహిత్ సేన మరోమారు నిరూపించినట్టయింది. తమపై కోల్‌కత నైట్ రైడర్స్.. ఇక ఎప్పుడూ గెలవలేదనే సందేశాన్ని పంపించినట్టయింది. 13 ఐపీఎల్ సీజన్లలో ఒక్కటి మినహా.. నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌దే ఆధిపత్యం. వరుసగా రెండోమ్యాచ్‌లోనూ ఆ జట్టుపై బౌలర్ల పెత్తనం కొనసాగించడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

 లో స్కోర్ చేసినా..

లో స్కోర్ చేసినా..

చెన్నై స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. నైట్ రైడర్స్ బౌలర్ల విజృంభణ ముందు వారంతా తేలిపోయారు. ఆలౌట్ అయ్యారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులు, 43 పరుగులతో కేప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే రాణించారు. మిడిల్ ఆర్డర్‌లో పాండ్యా బద్రర్స్ 15 పరుగులు చొప్పున చేశారు. మిగిలిన వారెవరూ రెండంకెలను అందుకోలేపోయారు. కోల్‌కత బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ అయిదు వికెట్లను పడగొట్టాడు.

వరుసగా 12వ విజయం

వరుసగా 12వ విజయం


ఈ లో-స్కోర్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ కాపాడుకోగలిగింది. ప్రత్యర్థి జట్టును 142 పరుగులకే కట్టడి చేయగలిగింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయిన ఇవాన్ మోర్గాన్ టీమ్ 142 పరుగులు మాత్రమే చేసింది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ ఓడిపోవడం వరుసగా ఇది 12వ సారి. ఇప్పటిదాకా మొత్తం 13 ఐపీఎల్ ఎడిషన్లు ముగిశాయి. ఇది 14వది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొన్న ప్రతీసారీ ముంబై ఇండియన్స్‌దే విజయం. వరుసగా ఇది 12 సారి. ఇదో రికార్డు.

ముంబైపై బౌలర్ల ఆధిపత్యం

ముంబైపై బౌలర్ల ఆధిపత్యం

మ్యాచ్ ఫలితమెలా ఉన్నప్పటికీ.. ముంబై ఇండియన్స్‌పై బౌలర్ల పెత్తనం కొనసాగుతోంది. బ్యాటింగ్ లైనప్ బలహీన పడిందనడానికి ఇదో ఎగ్జాంపుల్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఏ రేంజ్‌లో చెలరేగిపోయారో తెలిసిందే. ఏ సీజన్‌లోనూ పెద్దగా రాణించని హర్షల్ పటేల్.. ముంబైపై అయిదు వికెట్లను తీసుకున్నాడు. అదతని కేరీర్‌నే మలుపు తిప్పినట్టయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓ బౌలర్ ముంబై ఇండియన్స్‌పై అయిదు వికెట్లను పడగొట్టడం వరుసగా ఇది రెండోసారి.

 మొన్న హర్షల్ పటేల్.. ఈ సారి రస్సెల్

మొన్న హర్షల్ పటేల్.. ఈ సారి రస్సెల్

ముంబై ఇండియన్స్‌పై హర్షల్ పటేల్ 27 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టిన తాలూకు ప్రకంపనలు సద్దుమణగక ముందే ఈ సారి కోల్‌కత ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ దాన్ని కంటిన్యూ చేశాడు. చెన్నై మ్యాచ్‌లో రెండు ఓవర్లలో అయిదు వికెట్లను పడగొట్టాడు. దీనికతను ధారదాత్తం చేసుకున్న పరుగులు 15 మాత్రమే. 15 ఇచ్చి.. అయిదుమంది ముంబై బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి పట్టించాడు. చివరి అయిదు వికెట్లూ అతని ఖాతాలోనే పడ్డాయి. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, మార్కో జెమిసన్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రాలను అవుట్ చేశాడు.

కోల్‌కత తరఫున ఫస్ట్ బౌలర్‌గా

కోల్‌కత తరఫున ఫస్ట్ బౌలర్‌గా


కోల్‌కత తరఫున అయిదు వికెట్లను పడగొట్టి తొలి పేసర్‌గా ఆండ్రీ రస్సెల్ రికార్డ్ నెలకొల్పాడు. అదే జట్టు తరఫున ఇప్పటిదాకా అయిదు వికెట్లను పడగొట్టింది ఇద్దరే. వారిద్దరూ స్పిన్నర్లు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ను నమోదు చేసిన బౌలర్ ఆండ్రీ ఒక్కడే. 15 పరుగులకే అయిదు వికెట్లను పడగొట్టిన బౌలర్లెవరూ ఇప్పటిదాకా నైట్ రైడర్స్‌లో లేరు. ఓడిపోయిన జట్టులో అయిదు వికెట్లు తీసుకున్న ఆరో బౌలర్ ఆండ్రీ. రెండు జట్లలోనూ ఒక బౌలర్ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను పడగొట్టడం మొత్తం ఐపీఎల్ సీజన్లన్నింటిలోనూ ఇది నాలుగోసారి మాత్రమే. ఓడిన జట్టు కోల్‌కత తరఫున ఆండ్రీ అయిదు వికెట్లు తీసుకోగా.. ముంబై బౌలర్ రాహుల్ చాహర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

English summary
IPL 2021, Match 5: This was 12th loss for KKR against Mumbai Indians in the last 13 matches. Andre Russell became only the second bowler to pick a fifer against Mumbai Indians in IPL.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X